రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ పేరుతో సైబర్ కేటుగాళ్లు మోసం చేసేందుకు యత్నించారు. తెలంగాణ సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఐడీని నేరగాళ్లు క్రియేట్ చేశారు. దేశపతి స్నేహితులకు అత్యవసరంగా డబ్బులు కావాలని మెసేజ్ చేశారు.
నకిలీ ఐడీ క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఓఎస్డీ పీఏ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: SUICIDE ATTEMPT: అభివృద్ధి చేసి.. అప్పుల పాలై..!