ETV Bharat / crime

'దేవుడి గదిలో కోట్లు విలువ చేసే బంగారం.. పూజ చేస్తే బయటపడుతుంది'

author img

By

Published : May 23, 2022, 7:59 AM IST

Fake Babas Arrest in Hyderabad : రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలన్న ఆశ మధ్యతరగతి ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. సులభంగా డబ్బు సంపాదించాలనే కోరిక ఏది నిజమో.. ఏది అబద్ధమో.. ఏది మోసమో కూడా తెలుసుకోలేనంత వెర్రివాళ్లను చేస్తోంది. అందుకే దొంగ బాబాలు ప్రజలను ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. వారి మాటల మాయలో పడి అమాయకులు మోసపోతున్నారు వారికి లక్షల్లో నగదు ముట్టజెప్పుతున్నారు. ఇద్దరు దొంగ బాబాలను నమ్మి ఓ వ్యక్తి దాదాపు 7 లక్షలు పోగొట్టుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

Fake Babas Arrest in Hyderabad
Fake Babas Arrest in Hyderabad

Fake Babas Arrest in Hyderabad : నకిలీ బాబాలుగా అవతారమెత్తి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువనం గ్రామానికి చెందిన మతం చందు, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లికి చెందిన ఎర్నాళ్ల సంజీవ్‌లు నకిలీ బాబాలుగా అవతరం ఎత్తారు. హైదరాబాద్‌ శివారు ఎదులాబాద్‌లో పంచర్ దుకాణం నిర్వహిస్తున్న రాజు వద్దకు వచ్చి మాటలు కలిపారు. ఇంటికి తీసుకెళ్లి అన్న ప్రసాదం పెడితే మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పారు. బాబాల మాటలు నమ్మిన రాజు... వారిని ఇంటికి తీసుకెళ్లాడు.

Fake Babas Arrest in Hyderabad
నకిలీ బాబా అవతారమెత్తిన యువకుడు

ఇంట్లో పూజా గది మూసి ఉండటాన్ని గమనించిన బాబాలు.... అలా మూసి ఉంచితే అరిష్టమని మాయమాటలు చెప్పి రూ.35 వేలు వసూలు చేశారు. కొన్ని రోజులయ్యాక మరోసారి రాజు ఇంటికి వచ్చి... పూజ గదిలో 4 కోట్ల విలువైన బంగారం ఉందని... పూజలు చేస్తే బయటపడుతుందని చెప్పి పలు విడతల్లో రూ.7 లక్షలు వసూలు చేశారు. కొన్ని రోజులయ్యాక గది తెరిచి చూడాలని చెప్పి పరారయ్యారు.

Fake Babas Arrest in Hyderabad
నకిలీ బాబా అవతారమెత్తిన వ్యక్తి

దొంగ బాబాలు చెప్పినట్లుగానే కొన్ని రోజుల తర్వాత గది తెరిచి చూసిన రాజుకు అందులో ఏమీ కనిపించలేదు. దాంతో మోసపోయానని తెలుసుకున్న రాజు... ఈనెల 20న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నకిలీ బాబాల నుంచి 15 వేల రూపాయలు, కారు స్వాధీనం చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.