Illegal Affair Killed Son: ఏపీలోని నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామానికి చెందిన నవ్యభారతి, అదే గ్రామానికి చెందిన అబ్దుల్ బాషా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. ఆత్మకూరు మండలం కరటంపాడు సచివాలయంలో బాషా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న రషీదాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంపై పలుమార్లు నవ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు రాకపోవడంతో విసిగిపోయిన నవ్యభారతి సచివాలయానికి వెళ్లి రషీదాతో గొడవపడటడంతో పాటుగా... భర్తపై కేసుపెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న బాషా, బంధువుల ఇంట్లో తలదాచుకున్న నవ్యభారతిపై కత్తితో దాడికి యత్నించాడు. అడ్డుకోబోయిన నవ్యభారతి బంధువు నరేశ్, అతని స్నేహితులు ముఖేశ్, నాయబ్‌పైనా దాడి చేశాడు.
ఈ దాడిలో బాధితురాలికి కొడుకు వరుసయ్యే నరేష్ కత్తిపోట్లతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నరేష్‌కు మూడు నెలల క్రితమే వివాహం అయ్యింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
ఇదీ చూడండి: