explosion in iron industry : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలో మీనాక్షి ఇనుప పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో హేమంత్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హేమంత్ మృతదేహం పోస్టుమార్టం కోసం పఠాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ముగ్గురిని హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చదవండి :