ETV Bharat / crime

ఇంట్లోనే ఉరేసుకుని మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఆత్మహత్య.. - తాటి వెంకటేశ్వర్లు

Ex MLA Daughter suicide: గతంలో.. అశ్వరావుపేట, పినపాక ఎమ్మెల్యేగా పనిచేసిన తాటి వెంకటేశ్వర్లు కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఎంబీబీఎస్​ పూర్తి చేసిన ఆమె.. భద్రాద్రి కొత్తగూడెంలోని బూర్గంపాడు మండలం సారపాకలోని తమ స్వగృహంలో ఉరేసుకుని బలవన్మరణం చెందారు.

Ex MLA's daughter commits suicide by stabbing herself in sarapaka

author img

By

Published : Apr 14, 2022, 11:07 AM IST

Updated : Apr 15, 2022, 7:36 AM IST

Ex MLA Daughter suicide: మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె మహాలక్ష్మి (25) ఆత్మహత్య చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని తమ స్వగృహంలో ఈరోజు(ఏప్రిల్​ 14) ఉదయం మహాలక్ష్మి ఉరివేసుకున్నారు. గమనించిన కుటుంబసభ్యులు తలుపులు పగలగొట్టి.. హుటాహుటిన భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. మహాలక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మహాలక్ష్మి ఇటీవలే ఎంబీబీఎస్‌ పూర్తి చేసి ఉన్నత విద్యకు సిద్ధమవుతున్నారు. పీజీ సీటు విషయంలో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి వెంకటేశ్వర్లు దమ్మపేటలో ఉండడంతో స్థానికులు ఆయనకు సమాచారం అందించారు. విగతజీవిగా మారిన కుమార్తెను చూసి ఆయన కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆయన ఫిర్యాదు మేరకు ఎస్సై జితేందర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భద్రాచలం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

వెంకటేశ్వర్లుకు కుమార్తె, కుమారుడు సంతానం. కుమారుడు హైదరాబాద్‌లో ఉంటారు. భార్య రత్నకుమారి గతంలోనే అనారోగ్యంతో మృతి చెందారు. మహాలక్ష్మి పదో తరగతి వరకు భద్రాచలంలో చదువుకున్నారు. ఇంటర్‌ విజయవాడలో పూర్తి చేసి కరీంనగర్‌లో వైద్య విద్యను అభ్యసించారు.

ఇవీ చూడండి:

Last Updated : Apr 15, 2022, 7:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.