ETV Bharat / crime

రెండు రోజులైతే పరీక్షలైపోతాయి ఇంటికొస్తానని... - Engineering Student Suspected Death at Vijayawada

ఓ తెలంగాణ అబ్బాయి... ఓ ఆంధ్రా అమ్మాయి అనుకోకుండా ప్రేమలో పడ్డారు. పరీక్షల పేరుతో విజయవాడకు వెళ్లిన అమ్మాయి... తన కోసం వచ్చిన అబ్బాయి ఇద్దరూ ఒకే ఇంట్లో అద్దెకు ఉన్నారు. "ఇంకో రెండు రోజులైతే.. పరీక్షలైపోతాయి.. ఇంటికొస్తాను" అని చెప్పిన అమ్మాయి.. ఆస్పత్రిలో రెండు రోజులపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచింది. అసలు ఏం జరిగిందంటే..?

engineering-student-serious-injurie-at-vijayawada-in-krishna-district

author img

By

Published : Jul 27, 2021, 10:26 PM IST

ఇంజినీరింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఏపీలోని విజయవాడలో సోమవారం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండలం తెడ్లం గ్రామానికి చెందిన కంకిపాటి మున్ని (21) విజయవాడలో బీటెక్‌ చదవుతోంది. కరోనా నేపథ్యంలో ఇంటి వద్దే ఉంటూ ఆన్‌లైన్‌లోనే తరగతులకు హాజరవుతోంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొవ్వాడ తరుణ్‌ తెడ్లంలో ఉంటున్న తన సోదరి ఇంటికి గత ఏడాది వచ్చాడు. అక్క కుటుంబానికి చెందిన ఈ- సేవా కేంద్రంలో పని చేసేవాడు. ప్రాజెక్టు పని మీద మున్ని తరచూ అక్కడకు వచ్చేది. ఈ క్రమంలో వాళ్లిద్దరికీ పరిచయం ఏర్పడి... అది కాస్తా... ప్రేమకు దారితీసింది. ఈ నెలలో పరీక్షలు ఉన్నాయని మున్ని విజయవాడకు వచ్చింది. ఖాళీగా ఉండడం ఎందుకని... ఓ ప్రైవేటు సంస్థలో టెలికాలర్‌గా విధుల్లో చేరింది. అదే సంస్థలో తన స్నేహితుడు తరుణ్‌ కూడా చేరాడు. ఇద్దరూ ఒకే చోట ఉండాలని నిశ్చయించుకున్నారు. అన్నా, చెల్లెళ్లమని గుణదల ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఈ నెల 6న చేరారు.

మిస్డ్‌కాల్‌ వివాదం...

ఈ నెల 23న మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మున్ని ఫోన్‌కు ఆమె పాత స్నేహితుడు మిస్డ్‌కాల్‌ ఇచ్చాడు. ఆమె చరవాణిని పరిశీలించిన తరుణ్​... అతనితో ఎందుకు మాట్లాడుతున్నావని ప్రశ్నించాడు. ఆ నంబర్‌ బ్లాక్‌ లిస్ట్‌లో ఉందని.. తాను మాట్లాడడం లేదని మున్ని తెలిపింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో ఉన్న తరుణ్​.. "నిన్ను పెళ్లిచేసుకోను" అంటూ బయటకు వచ్చేశాడు. ఆ మాట విన్న మున్ని గదిలోపలికి వెళ్లి తలుపులు బిగించుకుంది. ఆ సమయంలో ఇంటి యజమాని వచ్చి, లోపల తమ పలుగు ఉందని... ఓ సారి ఇవ్వాలని బయట కూర్చున్న తరుణ్‌ని అడిగాడు. అతను తలుపు కొట్టగా... మున్ని ఎంత సేపటికీ తీయలేదు. అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా... ఉరేసుకుని ఫ్యాన్‌కు వేలాడుతోంది. వెంటనే తలుపులు పగులగొట్టి ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అక్కడ నుంచి తరుణ్‌ మాచవరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘటనను పోలీసులకు వివరించాడు. మూడురోజులుగా మృత్యువుతో పోరాడిన మున్ని సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష నివేదిక ఆధారంగా తరుణ్‌పై కేసు నమోదు చేయనున్నట్లు సీఐ ప్రభాకర్‌ తెలిపారు.

మాయమాటలతో వంచించాడు

"కంప్యూటర్‌ కొనిస్తానని, మాయమాటలు చెప్పి మా అమ్మాయిని తరుణ్‌ ఇక్కడికి తీసుకొచ్చాడు. మరో రెండు రోజుల్లో పరీక్షలు పూర్తి చేసుకుని ఇంటికి వస్తానని శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఫోన్‌లో చెప్పింది. వాళ్లు ప్రేమించుకుంటున్న సంగతి మాకు తెలియదు. మధ్యాహ్నం 2.30 గంటలకు తరుణ్‌ అనే వ్యక్తి సునీల్​కు ఫోన్‌ చేసి... మీ చెల్లి ఉరివేసుకుని చనిపోయిందని చెప్పాడు. వెంటనే కొత్త ఆసుపత్రికి వచ్చి సిబ్బందిని అడిగితే చనిపోలేదని.. కొన ఊపిరితో ఉందని చెప్పారు. మున్ని మెడ ఎముకలు విరిగిపోయాయి. కాలి మడమ పైభాగంలో బొబ్బలున్నాయి. తరుణే మున్నిని కొట్టి చంపాడు. తరుణ్​పై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేయాలి."

- మున్ని కుటుంబసభ్యులు

ఇవీ చూడండి:

'ఆక్సిజన్‌ కొరతతో మీ రాష్ట్రంలో ఎవరైనా చనిపోయారా?'

Husband Killed his Wife : నవవధువు హత్య.. భర్తే నిందితుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.