స్నేహితుల దినోత్సవం రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కలిసి చదువుకున్న నలుగురు మిత్రులు.. ఫ్రెండ్‌షిప్‌డేను ఆనందంగా గడిపి ఇంటికి వెళ్లే క్రమంలో ఘోర ప్రమాదం సంభవించింది. అప్పటి వరకు ఎంతో సరదాగా.. సంతోషంగా గడిపిన వాళ్లకు ఊహించని ప్రమాదం వాళ్లకు తీవ్ర దుఃఖం మిగిల్తించింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
సరాదాగా గడిపి ఇంటికి వెళ్తుంటే...
శంకర్‌పల్లిలోని ఇక్ఫై బిజినెస్ స్కూల్లో అభిషేక, సత్యప్రకాశ్, తరుణి, అశ్రిత చదువుకున్నారు. సత్యప్రకాశ్, తరుణి విద్యాబ్యాసం ముగించుకుని ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. అశ్రిత... కెనడాలో ఎంటెక్ చదువుతోంది. అభిషేక్ మాత్రం అదే క్యాంపస్‌లో మూడో సంతవత్సరం చదువుతున్నాడు. ఆశ్రిత ప్రస్తుతం ఇండియాలోనే ఉండటం వల్ల... స్నేహితుల దినోత్సవాన్ని ఆనందంగా గడపాలని నలుగురు నిర్ణయించుకున్నారు. మదీనాగుడాలో నివసించే అభిషేక్... తన కారులో మిగతా ముగ్గురిని ఎక్కించుకుని కొండాపూర్‌లోని ఓ పబ్‌కి వెళ్లారు. పదకొండు గంటల వరకు ఎంతో సరదాగా గడిపారు. నలుగురు డిన్నర్ చేసిన అనంతరం.. ఇంటికి బయలుదేరారు. ముందు సీట్లలో అభిషేక్, సత్యప్రకాశ్ కూర్చోగా.. వెనక సీట్లలో ఆశ్రిత, తరుణి కూర్చున్నారు. మద్యం సేవించిన అభిషేక్.. కారును అతి వేగంతో పోనిచ్చాడు. మైహోం మంగల వద్దకు రాగానే కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. కారు మూడు నాలుగు పల్టీలు కొట్టటంతో వెనక డోరు తెరుచుకోని.. అశ్రిత కిందపడిపోయింది. ఈ క్రమంలో ఆశ్రిత తలకు తీవ్ర గాయమైంది. తరుణి కూడా వెనక భాగంలో కూర్చోగా... తీవ్రంగా గాయాలపాలైంది. ముందు కూర్చోవటం వల్ల ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకుని అభిషేక్, సత్యప్రకాశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం...
వీళ్ల కారు వెనకే వస్తున్న మరో స్నేహితుడు... ప్రమాదాన్ని గమనించి వెంటనే అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించాడు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆశ్రిత తీవ్రంగా గాయపడటం వల్ల ఆస్పత్రికి వెళ్లిన కొద్ది సమయానికే మృతి చెందింది. తరుణి పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో అతివేగంతో వాహనం నడపటం వల్లే ప్రమాదం సంభవించిట్టు ప్రాథమికంగా నిర్ధరించారు.
ఇవీ చూడండి: