ETV Bharat / crime

హైదరాబాద్​ టూ నంద్యాల.. 13.3 కిలోల వెండి స్వాధీనం - అక్రమంగా తరలిస్తున్న వెండి పట్టివేత

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు చేపట్టిన వాహన తనిఖీల్లో 13.3 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు.

enforcement-officers-seized-13-kg-silver-at-panchalingala-check-post-in-kurnool-district
హైదరాబాద్​ టూ నంద్యాల.. 13.3 కిలోల వెండి స్వాధీనం
author img

By

Published : Mar 22, 2021, 3:40 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లో ఆర్టీసీ బస్సులో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 13.3 కేజీల వెండిని గుర్తించారు.

నాసిర్ హుస్సేన్ అనే వ్యక్తి నుంచి 78 వెండి బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విచారణ నిమిత్తం నిందితుడిని తాలూకా పోలీసులకు అప్పగించారు. ఆ వెండిని హైదరాబాద్ నుంచి నంద్యాలకు తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి : కొడవళ్లతో దాడి... నలుగురికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.