టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు నటుడు నవదీప్‌ను సుదీర్ఘంగా విచారించారు. 9గంటల పాటు కొనసాగిన విచారణలో అతని బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. నవదీప్‌కు చెందిన ఎఫ్ లాంచ్ క్లబ్ మేనేజర్‌ను కూడా అధికారులు ప్రశ్నించారు. గతంలో కెల్విన్ తరచూ ఎఫ్ క్లబ్‌కు వెళ్తుండేవాడని ఆధారాలు సేకరించిన అధికారులు అతనితో ఏమైనా లావాదేవీలు జరిగాయా అని తెలుసుకునేందుకు బ్యాంకు ఖాతాలకు పరిశీలించారు.
ఎఫ్ క్లబ్ బ్యాంకు ఖాతాలు, యూపీఐ లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించారు. పలు అనుమానాలస్పద లావాదేవీలపై ఆరా తీశారు. అవసరమైతే ఈ వ్యవహారంలో మరోసారి విచారించే అవకాశం ఉంది. గతంలో నవదీప్‌కు సంబంధించిన ఎఫ్ లాంచ్ క్లబ్లో పలువురు ప్రముఖులు హాజరు అయ్యారన్న సమాచారంతో కెల్విన్‌కు వారికి ఉన్న ఆర్థిక లావాదేవీలపై సుదీర్ఘంగా ఆరా తీశారు. విచారణ అనంతరం నవదీప్, అతని మేనేజర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కెల్విన్‌ను మరోసారి ఈడీ కార్యాలయానికి రావాలని అధికారులు సూచించారు. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్‌సింగ్, రానా, నందు, రవితేజను విచారించారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. గత 10 రోజులుగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటులను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు.. మూడ్రోజుల విరామం అనంతరం తిరిగి విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: Tollywood drugs case : ముగిసిన రానా విచారణ.. కెల్విన్‌తో లావాదేవీలపై ఈడీ ఆరా