ETV Bharat / crime

రుణయాప్‌ల కేసులో రూ.72.32 కోట్లు అటాచ్ చేసిన ఈడీ - loan app case latest updates

రుణయాప్‌ల కేసులో రూ.72.32 కోట్లు అటాచ్ చేసిన ఈడీ

author img

By

Published : Jan 12, 2022, 5:59 PM IST

Updated : Jan 12, 2022, 6:59 PM IST

17:58 January 12

రుణయాప్‌ల కేసులో రూ.72.32 కోట్లు అటాచ్ చేసిన ఈడీ

Loan Apps Case: రుణయాప్‌ల కేసులో కుడోస్‌ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) కంపెనీ సొమ్మును ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అటాచ్​ చేసింది. వివిధ బ్యాంకుల్లోని కుడోస్​ ఫైనాన్స్​ అండ్​ ఇన్వెస్ట్​మెంట్​కు చెందిన రూ.72.32 కోట్లు తాత్కాలిక జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది. కుడోస్​ సీఈవో పవిత్ర ప్రదీప్​ వాల్వేకర్​ను ఈడీ గతంలో అరెస్టు చేసింది.

అసలేం జరిగిందంటే..

ED Arrest NBFC CEO : చైనా కంపెనీల నిధులతో అక్రమంగా సూక్ష్మరుణ వ్యాపారాలు నిర్వహించేందుకు సహకరించిన కుడోస్‌ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) సీఈవో పవిత్ర ప్రదీప్‌ వాల్వేకర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) డిసెంబర్​లో అరెస్ట్‌ చేసింది. ఆయనకు హైదరాబాద్‌ పీఎంఎల్‌ఏ ప్రత్యేక న్యాయస్థానం 15 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. మొబైల్‌ యాప్‌ల ద్వారా వ్యక్తిగత సూక్ష్మరుణాలు ఇస్తున్న ఫిన్‌టెక్‌ కంపెనీల అక్రమ కార్యకలాపాలపై ఈడీ సాగిస్తున్న దర్యాప్తులో భాగంగా కుడోస్‌ కార్యకలాపాలపై దృష్టి సారించడంతో బండారం బహిర్గతమైంది. వినియోగదారులను గుర్తించి రుణ అర్హత కనిపెట్టడం దగ్గరి నుంచి రుణవాయిదాల వసూళ్ల వరకు పలు ఫిన్‌టెక్‌(డిజిటల్‌ రుణ భాగస్వాములు) కంపెనీలకు కుడోస్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా పనిచేస్తోందని దర్యాప్తులో వెల్లడైంది.

పేమెంట్‌ గేట్‌వేలకు ప్రత్యేక మర్చంట్‌ ఐడీలు

kudos non banking finance company : ప్రతీ ఫిన్‌టెక్‌ సంస్థ కోసం ప్రత్యేక పేమెంట్‌ గేట్‌వేతో పాటు మర్చంట్‌ ఐడీని రూపొందించడమే కాకుండా తన ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌నే కుడోస్‌ సమకూర్చింది. అనుమతులు పొందకుండానే ఫిన్‌టెక్‌ సంస్థలు సూక్ష్మ రుణ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాయి. వినియోగదారుల సెల్‌ఫోన్లలోకి, సామాజిక మాధ్యమాల్లోకి అక్రమంగా చొరబడి సేకరించిన సమాచారంతో రుణాలు చెల్లించని వారిపై వేధింపులకు పాల్పడ్డాయి. దీంతో పలువురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఫిన్‌టెక్‌ కంపెనీలు 95 శాతం రికవరీతో ఏడాదిలో భారీగా లబ్ధిపొందాయి. కుడోస్‌ కంపెనీకి రూ.10 కోట్ల నికర యాజమాన్య నిధే ఉన్నా.. రూ.2,224 కోట్లకుపైగా సొమ్మును రుణాల రూపంలో సమీకరించింది. ఈ సొమ్మంతా చైనా అధీనంలోని 39 ఫిన్‌టెక్‌ కంపెనీలకు చెందినదే. ఈ మొత్తం వ్యాపారంలో ఫిన్‌టెక్‌ కంపెనీలు రూ.544 కోట్ల మేర లాభాలు పొందాయి. వీటిలో కుడోస్‌ కంపెనీకి రూ.24 కోట్ల లబ్ధి చేకూరిందని ఈడీ నిర్ధారించింది.

ఇదీ చదవండి:

Last Updated : Jan 12, 2022, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.