Enforcement Directorate News: సర్వోమాక్స్ సంస్థకు చెందిన రూ.13.5కోట్లను, అక్రమంగా ఎపిడ్రిన్ తయారు చేసిన కేసులో రూ.1.6కోట్ల విలువ చేసే ఆస్తులను మంగళవారం ఈడీ అధికారులు అటాచ్ చేశారు.
బ్యాంకులను మోసం చేసిన కేసులో...
సర్వోమాక్స్ డైరెక్టర్లు అవసరాల వేంకటేశ్వర్రావు, చంద్రశేఖర్రెడ్డి పేరు మీద ఉన్న 15 స్థిరాస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. పలు బ్యాంకుల నుంచి దాదాపు రూ.402కోట్ల రుణాలు తీసుకున్న నిందితులు వాటిని డొల్ల కంపెనీలకు మళ్లించి సొంత అవసరాలకు ఉపయోగించుకున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ డబ్బులతో హైదరాబాద్ చుట్టుపక్కల ఆస్తులను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో 2018 ఫిబ్రవరి 2న సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. రెండు నెలల క్రితం అవసరాల వేంకటేశ్వరరావును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఎపిడ్రిన్ తయారీ కేసులో...
అక్రమంగా ఎపిడ్రిన్ తయారు చేసిన కేసులో నిందితులకు చెందిన 16 స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ ఆస్తులు తమిళనాడు, తెలంగాణలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. దీనికి పాల్పడిన డీఆర్ఐ అధికారులు నాగరాజు, సత్యనారాయణ, రాజుపై కేసు నమోదు చేశారు. డీఆర్ఐ ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులు ఎపిడ్రిన్ను విక్రయించడం ద్వారా 5.2కోట్ల రూపాయలను సంపాదించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ డబ్బుతో నిందితులు పలు చోట్ల ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించిన అధికారులు వాటిని అటాచ్ చేశారు.
ఇదీ చదవండి:CM KCR Statements: వీఆర్ఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్న్యూస్.. అసెంబ్లీలో సీఎం ప్రకటన..