ETV Bharat / crime

indus viva founders arrest : రూ.1500 కోట్లు మోసం.. ఇండస్ వివా కంపెనీ వ్యవస్థాపకులు అరెస్టు - ఇండస్ వివా కంపెనీ వ్యవస్థాపకులు అరెస్టు

ED ARRESTS indusviva FOUNDERs
ED ARRESTS indusviva FOUNDERs
author img

By

Published : Dec 17, 2021, 7:33 PM IST

Updated : Dec 17, 2021, 8:26 PM IST

19:30 December 17

రూ.1500 కోట్లు మోసం.. ఇండస్ వివా కంపెనీ వ్యవస్థాపకులు అరెస్టు

indus viva founders arrest : ఇండస్ వివా కంపెనీ వ్యవస్థాపకులను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. గొలుసుకట్టు వ్యాపారం పేరుతో మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలతో అంజారంద్, అభిలాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ.1500 కోట్లు మోసం చేసినట్లు ఈడీ అధికారులు తేల్చారు. నిందితులపై మనీలాండరింగ్​ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను రంగారెడ్డి జిల్లాలోని ఈడీ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. గొలుసు కట్టు విధానంలో అమాయకులను ఇండస్ వివా కంపెనీ మోసం చేస్తోందని గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్​లో 9 నెలల క్రితం కేసు నమోదైంది. ఈ కేసులో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు కొంతమంది ఇండస్ వివా ప్రతినిధులను అరెస్టు చేశారు.

గొలుసు కట్టు విధానంలో వ్యాపారం నిర్వహిస్తున్న ఇండస్ వివా ప్రతినిధులు దాదాపు పది లక్షల మంది సభ్యులను చేర్చుకొని వాళ్ల నుంచి రూ.1,500 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. పిరమిడ్ విధానంలో కొత్త సభ్యులను చేర్చితే కమిషన్ ఇస్తామంటూ ఇండస్ వివా ప్రతినిధులు అమాయకులను ఆకర్షించారు. సభ్యత్వ రుసుము కట్టి చేరితే కంపెనీకి చెందిన ఉత్పత్తులను విక్రయించాలని టార్గెట్​గా పెట్టేవారు. సాధారణ ఉత్పత్తులకు సైతం అధిక రేట్లకు అమ్మితే కమిషన్ ఇచ్చే వాళ్లని ఈడీ అధికారులు తెలిపారు. ఇలా వసూలుచేసిన డబ్బులను కంపెనీ ఖాతాలో జమ చేసి ఆ తర్వాత వ్యక్తిగత ఖాతాలకు మళ్లించేవారు. ఆ మొత్తంతో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. నిధుల మళ్లింపు కేసులో ఇండస్ వివా కంపెనీ వ్యవస్థాపకులు అంజారంద్​తో పాటు అభిలాష్​ను అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఈ కేసులో మరిన్ని విషయాలు దర్యాప్తు చేయాల్సి ఉందని ఈడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇదీ చూడండి: hair illegal transport: హైదరాబాద్‌ టూ చైనా.. జుట్టు దందాతో కోట్ల రూపాయల హవాలా..

Last Updated : Dec 17, 2021, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.