ETV Bharat / crime

హోలీ వేడుకల్లో అపశృతి.. ఓ బాలుడు మృతి - Disruption during Holi celebrations

హోలీ పండుగ వేళ ఆ గ్రామంలో విషాదం నెలకొంది. స్నేహితులతో ఈతకు వెళ్లిన చిన్నారుల్లో ఓ బాలుడు మృతి చెందగా.. మరో బాలుడు మునిగిపోతుండగా స్థానికులు రక్షించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

during Holi celebrations time A boy died at venkatapur sangareddy
హోలీ వేడుకల్లో అపశృతి.. ఓ బాలుడు మృతి
author img

By

Published : Mar 29, 2021, 3:43 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపూర్​లో హోలీ వేడుకల్లో విషాదం సంభవించింది. హొలీ సంబురాల్లో రంగులు చల్లుకున్న అనంతరం పలువురు బాలురు స్నానానికి చెరువులోకి వెళ్లారు.

వారిలో ఓ 12 ఏళ్ల యువకుడు చెరువులో మునిగి దుర్మరణం చెందాడు. మరో బాలుడు చెరువులో మునుగుతుండగా స్థానికులు రక్షించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నారాయణఖేడ్ ఎస్సై వెంకటరెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి : నోముల వారసుడికే నాగార్జునసాగర్ టికెట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.