ETV Bharat / crime

బెల్లంపల్లిలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత - మంచిర్యాల జిల్లా తాజా వార్తలు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

Duplicate cotton seeds seized at bellampally in manchiryala district
బెల్లంపల్లిలో నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
author img

By

Published : Feb 3, 2021, 11:24 AM IST

రైతులకు నకిలీ పత్తి విత్తనాలను అంటగడుతున్న ముఠాను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసులు అరెస్ట్​ చేశారు. బెల్లంపల్లికి చెందిన పత్తి రెడ్డి ప్రభాకర్ రెడ్డికి పూస సుబ్బారావు అనే వ్యక్తితో పరిచయమైంది. సుబ్బారావు 2003లో 610 జీవో కింద ఆంధ్ర నుంచి వచ్చి భీమినిలో ఎస్జీటి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. వీరిద్దరితో పాటు మరి కొంత మంది కలిసి భీమిని, నెన్నెల, తాండూరు, కన్నెపల్లి, బెల్లంపల్లి మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలు విక్రయించారు. 6 రోజుల క్రితం ప్రభాకర్ రెడ్డి, సుబ్బారావు, చౌదరి దినేష్, మహేష్ సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరువు శివారులో ఓ వ్యక్తి దగ్గర 46 బస్తాల నకిలీ పత్తి విత్తనాలను తీసుకొచ్చారు.

నకిలీ పత్తి విత్తనాల సంచులను వారి ఇళ్లలో భద్రపరిచారు. ప్రభాకర్ రెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీ చేయగా 11 బస్తాల పత్తి విత్తనాలు దొరికాయి. అతన్ని విచారించి.. మిగిలిన విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు మొబైల్స్​, బొలెరో వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. నకిలీ పత్తి విత్తనాల విలువ 49 లక్షలు ఉంటుందని రామగుండం సీపీ సత్యనారాయణ వెల్లడించారు.

ఇదీ చదవండి: ఓటీపీతో రేషన్.. సామాన్యులకు తప్పని పరేషాన్...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.