ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారని... సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో మందు బాబులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే ఎక్సైజ్ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని వాపోయారు. ఈ విషయంలో కొన్ని రోజులుగా దుకాణాల నిర్వాహకులతో వాదిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.
బుధవారం సాయంత్రం ఓ మద్యం దుకాణం ఎదుట మద్యం ప్రియుల గొడవ ఎక్కువ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మందు బాబులను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులకు, వారికి మధ్య కాస్త తోపులాట జరిగింది. ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న దుకాణాదారులపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో మైలురాయి