drugs tracking: మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా డ్రగ్స్ వినియోగం మాత్రం ఆగడం లేదు. తాజాగా నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గోపికృష్ణ పట్టుబడ్డ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గోకుల్ ప్లాట్స్‌లో చోటుచేసుకుంది.
దొమ్మరాజు గోపికృష్ణ అనే వ్యక్తి నిషేధిత ఎండిఎం ఏ డ్రగ్స్ ను ఓ వ్యక్తికి విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి 55వేల రూపాయల విలువచేసే పది నిషేధిత డ్రగ్స్ మాత్రలు, ఓ సెల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద, ఎస్ ఓటి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక్రిశాట్ వద్ద మరో వ్యక్తి అరెస్టు.. అలాగే మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నమరో వ్యక్తిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. టోలీచౌకీకి చెందిన అరబిక్ ట్యూటర్ మహ్మద్ అష్రఫ్ బేగ్ అనే వ్యక్తి డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఇక్రిశాట్ వద్ద అదుపులోకి తీసుకుని, తనిఖీలు చేపట్టగా, అతని వద్ద 13 గ్రాముల కొకైన్ లభ్యమైంది. అయితే గతంలో రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో పట్టుబడిన అష్రఫ్ మాదకద్రవ్యాల నిరోధక కేసు కింద జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా ఇదే దందా కొనసాగిస్తున్నాడు. గోవాకు చెందిన జూడ్ అనే వ్యక్తి నుంచి మాదకద్రవ్యాలు తీసుకువచ్చి అవసరమైన వారికి సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న జూడ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడి వద్ద నుంచి 13 గ్రాముల కొకైన్‌తో పాటు 64,340 నగదు, ద్విచక్ర వాహనం, డెబిట్, క్రెడిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి..