ETV Bharat / crime

Drug trafficking in telangana: శిక్ష పడదు.. మత్తు వదలదు.. నేరం ఆగదు!! - తెలంగాణ వార్తలు

మత్తుపదార్థాలు రవాణా చేస్తూ దొరికితే కటకటాలపాలు కావాల్సిందే. మాదకద్రవ్యాల కేసులో(Drug trafficking in telangana) నేరం రుజువైతే ఏళ్ల తరబడి శిక్ష అనుభవించక తప్పదు.. ఒకసారి ఈ కేసులో దొరికితే కనీసం మూడు నెలలు బెయిల్‌ రాదు... నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌(ఎన్‌డీపీఎస్‌)చట్టం-1985 చెబుతున్న విషయాలివి. అయినా మత్తుపదార్థాల రవాణా ముఠాలు వెనకడుగు వేయడంలేదు. శిక్షల భయం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత రెండేళ్లలో ఎన్‌డీపీఎస్‌ చట్టం కేసుల్లో ఒక్కటీ తెమలకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.

Drug trafficking in telangana, telangana drugs case
తెలంగాణ డ్రగ్స్ కేసులు, తెలంగాణ మాదక ద్రవ్యాల కేసు
author img

By

Published : Nov 14, 2021, 9:09 AM IST

తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా వేళ్లూనుకుపోయిన మత్తుదందా(Drug trafficking in telangana) విశ్వరూపం క్రమంగా వెలుగుచూస్తోంది. పోలీస్‌, ఎక్సైజ్‌, నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) తదితర దర్యాప్తు సంస్థలు నిఘా విస్తృతం చేయడంతో రోజూ ఏదో ఒకచోట ఈ వ్యవహారాలు బయటపడుతున్నాయి. ఇన్నాళ్లూ ఈ దందా సాగలేదా? అంటే కచ్చితంగా సాగింది. కానీ నిఘా లోపంతో బయటపడలేదు. లాక్‌డౌన్‌లో ఈ అక్రమ మత్తు ముఠాలు మరింత వేగంగా విస్తరించాయి. పనుల్లేక ఖాళీగా ఉన్న యువతలో పలువురు మాదకద్రవ్యాలకు దగ్గరయ్యారు. హైదరాబాద్‌ నుంచి స్వగ్రామాలకు వెళ్లిన పలువురు ఊళ్లకూ మాదకద్రవ్యాల్ని విస్తరింపజేశారు. అయితే పాత నేరస్థులే ఎక్కువగా చిక్కుతుండటాన్ని బట్టి ఎన్‌డీపీఎస్‌ చట్టం అంటే మత్తు ముఠాలకు(Drug trafficking in telangana) భయం కలగడంలేదని తెలుస్తోంది.

3-4 ఏళ్ల తర్వాత ట్రయల్స్‌

ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద అరెస్టయితే బెయిల్‌ సులభంగా దొరకదు. కనీసం 90 రోజులు.. తీవ్రత అధికంగా ఉంటే 180 రోజులు బయటికి రాలేరు. ఒక వ్యక్తి దగ్గర 1-20 కిలోల్లోపు మాదకద్రవ్యాలు(Drug trafficking in telangana) దొరికి నేరం రుజువైతే 10 ఏళ్లవరకు శిక్షపడుతుంది. 20 కిలోలు దాటితే 20 ఏళ్ల వరకు శిక్షపడే అవకాశముంది. అయితే కేసు నమోదైన 3-4 ఏళ్ల తర్వాత కానీ ట్రయల్స్‌ ఆరంభం కావడం లేదు. ఈలోపు బెయిల్‌పై బయటికి వస్తున్న నేరస్థులు తిరిగి దందా కొనసాగిస్తున్నారు. జైల్లో ఉన్నప్పుడు ఇదే తరహా కేసుల్లో అరెస్టయిన నిందితులతో కలిసి కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దర్యాప్తు సంస్థల కళ్లు కప్పడమెలా? దొరకకుండా తప్పించుకోవడం ఎలా? అనే అంశాలపై దృష్టి సారిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో చిక్కిన ‘మెపిడ్రిన్‌’ కేసు కీలక నిందితుడు హన్మంతరెడ్డి గడిచిన నాలుగేళ్లలో దాదాపు రెండేళ్లు జైలులోనే ఉన్నాడు. గతంలో పటాన్‌చెరులో డీఆర్‌ఐకి, మహబూబ్‌నగర్‌లో పోలీసులకు దొరికాడు.

మద్యంపైనే మమకారం.. తనిఖీలకు దూరం

మాదకద్రవ్యాల నియంత్రణ బాధ్యత ప్రధానంగా ఎక్సైజ్‌శాఖదే. కానీ మద్యం విక్రయాలపైనే ఆశాఖ నిమగ్నమైందనే విమర్శలున్నాయి. మాదకద్రవ్యాల కేసుల్లో ఎలా వ్యవహరించాలనే అంశంపై క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ లేదు. ఈ కేసుల(Drug trafficking in telangana) దర్యాప్తుపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ ఆబ్కారీ శాఖలో ఒక్క పబ్లిక్‌ ప్రాసిక్యూటరూ లేరు. ఆబ్కారీ భవన్‌, ఎక్సైజ్‌ అకాడమీలో ఉన్న రెండు పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. అనుమానితుల దగ్గర దొరికినవి నిషేధిత మాదకద్రవ్యాలే అని నిరూపించేందుకు సంబంధిత కిట్లతో పరీక్షించాల్సి ఉంటుంది. పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖల వద్ద ఆ కిట్లు లేవు. ఎన్‌సీబీ నుంచి అయిదేళ్ల క్రితం ఎక్సైజ్‌శాఖ అయిదు కిట్లను తెప్పించుకుంది. వాటిల్లో వినియోగించే రసాయనాల పని సామర్థ్యం ఆరు నెలలే కావడంతో మురిగిపోయాయి. కిట్లను సమకూర్చుకోవడం బడ్జెట్‌తో కూడిన వ్యవహారం కావడంతో అటువైపు కన్నెత్తి చూడటం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏవోబీ.. తెలంగాణలో ధూల్‌పేట్‌

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి వినియోగం ఎక్కువ. మాదకద్రవ్యాల(Drug trafficking in telangana) వ్యసనానికి ఈ మహమ్మారి గేట్‌వేలా మారింది. ముఖ్యంగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి దేశంలోని 13 రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతోంది. తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లకు తరలుతోంది. హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో ఈ దందా వ్యవస్థీకృతంగా వేళ్లూనుకుంది. మూడు నెలల క్రితం ‘ఆపరేషన్‌ ధూల్‌పేట్‌’ చేపట్టారు. దాదాపు 60 మంది పాతనేరస్థుల్ని కటకటాల్లోకి పంపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) ఏవోబీలో గంజాయి సాగుక్షేత్రాలపై దాడుల్ని తీవ్రతరం చేసింది. దాదాపు 6,100 ఎకరాల్లో గంజాయి సాగు క్షేత్రాలను జియోమ్యాపింగ్‌ చేసింది. 15 నెలల్లో 4,417 మందిని అరెస్ట్‌ చేసి 2.36 లక్షల కిలోల గంజాయిని జప్తు చేసింది. ఏవోబీ, ధూల్‌పేటల్లోని వ్యవస్థీకృత ముఠాల్ని సమర్థంగా నియంత్రించగలిగితే గంజాయిపై చాలావరకు విజయం సాధించినట్లే అవుతుంది.

సీఆర్పీసీ సెక్షన్ల సమర్థ వినియోగంతో సత్ఫలితాలు

మాదకద్రవ్యాల దందాలో విక్రేతలు కొత్తవాళ్లను తొందరగా నమ్మరు. అందుకే పాతనేరస్థుల పాత్ర ఎక్కువ. మత్తుముఠాలపై 109, 110 సీఆర్పీసీ సెక్షన్లను విరివిగా ప్రయోగించాలి. తొలుత ఈసెక్షన్ల కింద బైండోవర్లు చేయడం ద్వారా వారిలో భయాన్ని పాదుకొల్పాలి. అయినా దందా సాగిస్తే రూ.2-3 లక్షల వరకు జరిమానా విధించొచ్చు. జరిమానా చెల్లించకపోతే 1-2 ఏళ్ల వరకు జైలుశిక్షకు గురయ్యే అవకాశముంది. ఇలాంటి దీర్ఘకాలిక ప్రణాళికతో గుడుంబా మాదిరే మాదకద్రవ్యాల్నీ నియంత్రించొచ్చు. కలెక్టర్లు, ఎస్పీల స్థాయిలో కార్యాచరణ రూపొందించాలి.

-- వివేకానందరెడ్డి, విశ్రాంత డిప్యూటీ కమిషనర్‌, ఆబ్కారీశాఖ

కేసుల వివరాలు

ఇదీ చదవండి: Petrol Attack: విశాఖలో యువతిపై ప్రేమోన్మాది దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.