ETV Bharat / crime

Vijayawada Doctor Arrest : సహ వైద్యురాలిపై లైంగిక వేధింపులు.. వైద్యుడి అరెస్టు - Vijayawada doctor case updates

Doctor Arrest On Rape Allegations : సహ వైద్యురాలిపై అత్యాచారం ఆరోపణలతో విజయవాడకు చెందిన డాక్టర్ కృష్ణకిశోర్​ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

Vijayawada Doctor Arrest
Vijayawada Doctor Arrest
author img

By

Published : Jan 7, 2022, 10:15 AM IST

Doctor Arrest On Rape Allegations : వైద్యురాలిని లైంగికంగా వేధించిన ఓ వైద్యుడిని ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన కృష్ణకిషోర్ అనే వైద్యుడు.. తనపై అత్యాచారం చేశారని బాధితురాలు పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో తనతో కలిసి ఓ ఆస్పత్రిలో డాక్టర్ కృష్ణకిషోర్ పనిచేశారని, అప్పుడు ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Doctor Arrest in Vijayawada : ఇద్దరూ కలిసి పనిచేస్తున్న సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని, అందుకు తాను ఒప్పుకోలేదని తెలిపారు. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వేధిస్తూ తన భర్తనూ చంపేస్తానని బెదిరింపులకు గురి చేశారన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కృష్ణకిషోర్, అతనికి సహకరించిన విజయకుమార్​ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.