ETV Bharat / crime

Harassment at school: బాలికలపై జిల్లా అధికారి వేధింపులు.. చంపేస్తానంటూ బెదిరింపులు - పాఠశాలలో వేధింపులు

ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. ఎన్ని కఠిన శిక్షలు అమలు చేసినా బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులు(District officer harassment) తగ్గడం లేదు. పైగా జిల్లా స్థాయి అధికారి హోదాలో ఉండి కూడా... పాఠశాల విద్యార్థినుల అసభ్యంగా(Harassment at school) ప్రవర్తించారు ఓ వ్యక్తి. మద్యం మత్తులో రాత్రి ఎనిమిది గంటలవరకు అనవసర బోధనలు చేశారని.. పాటలు పాడుతూ, నృత్యాలు చేయాలంటూ అసభ్యకరంగా మాట్లాడారని విద్యార్థినులు ఆరోపించారు.

Harassment at school, Harassment on school girls
బాలికలపై వేధింపులు, విద్యార్థినులపై వేధింపులు
author img

By

Published : Nov 14, 2021, 8:47 AM IST

బాగోగులు చూడాల్సిన జిల్లా గిరిజన సంక్షేమ అధికారే తమపట్ల అసభ్యంగా(Harassment at school) ప్రవర్తించారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాకుండా చంపేస్తానని బెదిరించారని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చున్నంబట్టివాడ సాయికుంటలోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థినులు శనివారం ఆందోళన చేశారు. ఆయనను విధుల నుంచి తొలగించాలని వారు డిమాండ్‌ చేశారు. ‘గురువారం సాయంత్రం పాఠశాల ముగించుకుని వసతిగృహానికి వెళ్తున్న సమయంలో అక్కడకు వచ్చిన డీటీడీవో జనార్దన్‌ మద్యం తాగిన మైకంలో మా పట్ల అసభ్యకరంగా(Harassment at school) ప్రవర్తించారు. తరగతి గది కిటీకీలు, తలుపులు మూసేసి అనవసర బోధనలు చేశారు. కొందరిపై చేయి చేసుకున్నారు. రాత్రి 8 గంటల వరకు తీవ్రపదజాలంతో దూషించారు. మళ్లీ ఆదివారం వస్తా.. ఆరోజు పాటలు పాడుతూ, నృత్యాలు చేయాలంటూ అసభ్యకరంగా మాట్లాడారు’ అని 9, 10 తరగతుల విద్యార్థినులు పేర్కొన్నారు.

ఈ విషయంపై అదే రోజు రాత్రి విద్యార్థినులు నిరసన తెలిపారు. విషయాన్ని ప్రిన్సిపల్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో సద్దుమణిగింది. ఒక రోజు గడిచినా తమకు న్యాయం జరగలేదని శనివారం ఉదయం అల్పాహారం కూడా తినకుండా విద్యార్థినులు మరోసారి ఆందోళనకు దిగారు. సీఐ నారాయణ నాయక్‌, ఎస్సై దేవయ్య ఘటనాస్థలానికి చేరుకొని విద్యార్థినులతో మాట్లాడారు. విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: రెండేళ్ల బాలికనూ వదలని కామాంధుడు.. హత్యకు యత్నించి...

సీఐడీలో ఉన్నతాధికారి అంటూ..

మరో ఘటనలో నేను సీఐడీలో ఉన్నతాధికారిని(CID officer harassment) .. నువ్విష్టమని చెబితే నన్నే కాదంటావా..? నువ్వు నాకు కావాలంతే అంటూ ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్న ఘటన రాచకొండ పోలీసు కమిషనరేట్​ పరిధిలో తాజాగా వెలుగు చూసింది. బాధితురాలి(30) ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్‌క్రైమ్‌(CID officer harassment) పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన బాధితురాలికి గత నెల 29న కొత్త నెంబరు నుంచి ముందుగా వాట్సాప్‌(CID officer harassment) లో సందేశం వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికి వీడియో కాల్స్‌ రావడం మొదలైంది. ఇదీ చదవండి: పరిచయస్థులు, బంధువులే కామాంధులు

బాగా నచ్చావు

నిన్ను ఓ వేడుకలో చూశా. అప్పుడే బాగా నచ్చావు. నీతో గడపాలని ఉంది... అంటూ బాధితురాలి(CID officer harassment) కి వాట్సాప్​ సందేశం పంపించాడు. ఆ తర్వాత వీడియో కాల్​ చేసి ఎక్కడికి రావాలో చెప్పు అంటూ అసభ్యకరంగా మాట్లాడుతూ.. వేధించడం మొదలు పెట్టాడు. అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పంపించాడు. బాధితురాలు చూసినట్లు డబుల్‌ టిక్స్‌ రాగానే వెంటనే డిలీట్‌ చేసేవాడు.

సీఐడీ అధికారినంటూ..

సహనం కోల్పోయిన బాధితురాలు అసలు నువ్వెవరు..? ఎందుకిలా చేస్తున్నావంటూ నిలదీసింది. తాను సీఐడీ(CID officer harassment) విభాగంలో ఉన్నతాధికారిని అని చెప్పాడు. కొంతసేపటికి పోలీసు యూనిఫారంలో వీడియో కాల్‌ చేయడంతో ఆమె భయపడింది. వెంటనే ఆ నంబరును బ్లాక్‌ చేసింది. ఆ తర్వాత మరో నెంబరు నుంచి మెసేజ్‌లు, వీడియో కాల్స్‌ రావడం మొదలైంది. నా నంబర్‌నే బ్లాక్‌ చేస్తావా..? నేను అడిగితే కాదంటావా అంటూ బెదిరింపులకు దిగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

ఇదీ చదవండి: హెడ్​ మాస్టర్​ మెడలో చెప్పుల దండ- గ్రామం మొత్తం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.