ETV Bharat / crime

GIRL KIDNAP CASE: ఆరేళ్లకు నిందితుడి ఆటకట్టు.. ఇన్నాళ్లు ఏమైంది?

ఆరేళ్ల క్రితం పాఠశాల ఉపాధ్యాయుడే వాళ్ల కూతురిని కిడ్నాప్ చేశాడు. పలు రాష్ట్రాలు తిప్పుతూనే ఆమెను ఇద్దరు పిల్లలకు తల్లిని చేశాడు. ఇన్నాళ్ల తర్వాత ఆ తల్లిదండ్రుల కళ్లల్లో చెప్పలేని ఆనందం. ఎందుకంటే కిడ్నాపైన ఆరేళ్ల తర్వాత కన్నబిడ్డ కళ్లముందు కనబడటంతో ఒక్కసారిగా తెలియని అనుభూతితో ఆ తల్లిదండ్రులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

GIRL KIDNAP CASE
ఆరేళ్లకు నిందితుడి ఆటకట్టు
author img

By

Published : Oct 6, 2021, 10:57 AM IST

ఆంధ్రప్రదేశ్​ విశాఖపట్నం జిల్లాలోని చోడవరం పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో... 2015 జూన్‌26వ తేదీన ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక అదృశ్యమైంది. అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కొయ్యాన తిరుపతిరావు బాలికను కిడ్నాప్‌ చేసి విశాఖకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి దిల్లీకి.. రాజస్థాన్‌కు మకాం మార్చాడు. అక్కడి నుంచి మళ్లీ హరియాణాకు వెళ్లి మరోసారి తెలంగాణాలోని నిజామాబాద్‌కు తీసుకొచ్చాడు. ఇలా తిప్పి రాజస్థాన్‌లోని జోగీఘట్టాలో స్థిరపడ్డాడు.

ఆనాటి నుంచి ఆ బాలిక తల్లిదండ్రులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. 2016లో వారి రోదన చూసి, ఉదాసీనంగా వ్యవహరించారంటూ అప్పటి సీఐ మురళీరావును బదిలీ చేశారు. 2017లో ఉన్నతాధికారులకు మొరపెట్టుకోగా, సీబీసీఐడీకి కేసు అప్పగించారు. అయినా కేసు పురోగతి లేదంటూ ఆ తండ్రి హైకోర్టును సైతం ఆశ్రయించాడు.

బాలికను తీసుకెళ్లిన తిరుపతిరావు రాజస్థాన్‌లో అళ్వార్‌ జిల్లా జోగీఘట్టాలోని విజయనగర్‌ కాలనీలో పిల్లలకు ట్యూషన్స్‌ చెప్పుకొంటూ జీవనం సాగించేవాడు. వారికి అయిదేళ్ల పాప, మూడేళ్ల బాబు ఉన్నారు. బతుకుదెరువు కోసం బ్యాంకు రుణానికి దరఖాస్తు చేశాడు. అప్పటికే విశాఖ జిల్లాలో డిఫాల్టర్‌ అయినట్లు తేలింది. బ్యాంకు లావాదేవీలు, పాన్‌ కార్డుల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో ఐటీ కోర్‌ బృందం నిందితుడి ఆచూకీని కనిపెట్టింది. ఆ సమాచారంతో సీఐ ఇలియాస్‌ మహమ్మద్‌, ఎస్సై విభీషణరావు, సిబ్బంది రాజస్థాన్‌ వెళ్లారు. అక్కడి పోలీసుల సహాయంతో ట్రాన్సిస్ట్‌ వారంట్‌పై వారిద్దరినీ ఇక్కడికి తీసుకొచ్చారు. ‘బాలికను కిడ్నాప్‌ చేసే సమయానికే తిరుపతిరావుకు భార్య, కొడుకు ఉన్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ప్రస్తుతం బాధితురాలి వయస్సు 18 ఏళ్ల నాలుగు నెలలు. ఆమె ఇచ్చే ఫిర్యాదుపై కేసు దర్యాప్తు మరింత గట్టిగా ఉంటుంద’ని సీఐ చెప్పారు.

ఆశలు వదులుకున్నాక ఆనందం

ఇన్నాళ్లకు మా పాప దొరికిందన్న ఆనందం ఎవరికీ చెప్పుకోలేనిది. కిడ్నాపర్‌ మా పాపను ఎక్కడో ఏదో చేసి ఉంటాడని భయపడి ఆశ వదులుకున్నాం. దేవుడు దయదలిచాడు. మా పాప మా చెంతకు చేరింది. ఏం జరిగిందనేది చెప్పలేకపోతోంది. వివరాలు చెప్పినదాన్ని బట్టి కేసు విషయంలో ముందుకు వెళ్తాం. నిందితుడిని బయట ప్రపంచానికి తెలిసేలా చేస్తే బాగుండేది. ఇలా చేయడం వల్ల ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి.

- బాధితురాలి తండ్రి, చోడవరం

ఇదీ చూడండి: Road accident: స్కూటీని ఢీకొట్టిన లారీ.. తల్లితో సహా పసికందు మృతి

VSP bullets seize: విశాఖలో కలకలం.. వృద్ధురాలి బ్యాగ్​లో బుల్లెట్లు..!

student died: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. యువతి దుర్మరణం

తరగతిగదిలోనే విద్యార్థినిపై హెడ్​మాస్టర్​ లైంగిక వేధింపులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.