అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్లకు చెందిన చుక్కబొట్ల లస్మన్న(59) తనకున్న ఆరెకరాలతోపాటు.. మరో అయిదు ఎకరాలు రూ.85 వేలకు కౌలుకు తీసుకున్నాడు. అందులో పత్తి సాగు చేశాడు. పెట్టుబడి కోసం తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.2 లక్షల రుణం, బయట మరో రూ.3 లక్షలు అప్పు చేశాడు.
వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. అప్పులు తీర్చే మార్గం కానరాక మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఉదయం చేనుకు వెళ్లి పురుగు మందు తాగాడు. ఆయనకు భార్య కమల, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శిరీష తెలిపారు.
ఇదీ చూడండి : రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెలు దుర్మరణం