Sheep died in khammam: తెలంగాణా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ సిబ్బంది చేసిన నిర్వాకానికి 10 మూగ జీవాలు బలైనాయి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెంలో గిడ్డంగుల సంస్థ సిబ్బంది గిడ్డంగిలో ఉన్న సరుకును ఎలుకలు, పందికొక్కులు నాశనం చేస్తున్నాయని వాటికి మందు కలిపిన బియ్యం పెట్టారు. తదుపరి మిగతా వాటిని రోడ్డు పక్కన పోశారు.
మూగ జీవాలు ఆ బియ్యాన్ని ఆహారంగా భావించి తీసుకోవడంతో వెంటనే 10 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని అస్వస్థతకు గురైనాయి. దీంతో గొర్రెల యజమానులు చనిపోయిన గొర్రెలను గిడ్డంగుల సంస్థ ఎదుట పెట్టి నిరసన వ్యక్తం చేశారు. గొర్రెల మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, తమకు సుమారు 2 లక్షలు మేర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇవీ చదవండి: