ETV Bharat / crime

పోలీసుల సమక్షంలో ఇసుక కుప్పలో శవం వెలికితీత

author img

By

Published : May 24, 2021, 7:59 PM IST

వ‌న‌ప‌ర్తి జిల్లా రామకృష్ణాపురంలో కుమారుడిని హత్య చేసిన తల్లి నాగ‌మ్మ... అతని మృతదేహన్ని ఇంటి సమీపంలో ఉన్న ఇసుక కుప్పలో పాతిపెట్టినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు సమక్షంలో పోలీసులు శవాన్ని బయటకు తీశారు.

ramakrishnapuram mother killed son
పోలీసుల సమక్షంలో ఇసుక కుప్పలో శవం వెలికితీత

వ‌న‌ప‌ర్తి జిల్లా కొత్త‌కోట మండ‌లంలోని రామకృష్ణాపురంలో కుమారుడిని హత్య చేసిన తల్లి నాగమ్మ… శివ మృతదేహన్ని ఇంటి పక్కనే ఉన్న ఇసుక కుప్పలో పాతిపెట్టినట్లు చెప్పింది. సోమవారం తహసీల్దార్ వెంకటేశ్వర్లు సమక్షంలో పోలీసులు శవాన్ని వెలికితీశారు.

మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడం వల్ల మహబూబ్​నగర్ నుంచి వచ్చిన వైద్యులు పార్వతి, సుధీర్ అక్కడే పంచనామా నిర్వహించి, గ్రామ సమీపంలోనే ఖననం చేశారు. ఈ హత్య కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగశేఖర రెడ్డి తెలిపారు.

సంబంధిత కథనం: కుమారుడిని చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన తల్లి

హత్యను ఇద్దరే చేశారా, ఇంకెవరైనా ఉన్నారనే అనే విషయాలు పోస్టుమార్టం నివేదిక వచ్చాకా తెలుస్తుందని ఎస్సై అన్నారు. ఈ కేసులో మరికొందరి పాత్ర ఉందేమోనని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే చోరీ చేసిన ఇల్లాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.