Aunt killed Daughter in law: ఏపీలో రోజురోజుకూ హత్యలు పెరిగిపోతున్నాయి. తండ్రి మందలించాడని, కోడలు ఇంట్లో నుంచి బయటికి నెట్టిందని, ఆస్తి పంపకాలు సరిగా చేయడం లేదని, అక్రమ సంబంధాలు బయటపెడుతున్నారని ఏదో ఓ విధంగా కక్షలు పెంచుకుని.. తల్లిదండ్రులను కొడుకు చంపడమో లేక తోడబుట్టిన సోదరిని తమ్ముడు చంపడంలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఆలోచించి పరిష్కరించుకునే సహనం లేక అవతలి వారి ప్రాణాలను అవలీలగా తీసేస్తున్నారు. తాజాగా కుటుంబ కలహాలతో కోడలి తలను అత్త నరికిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది.
జిల్లాలోని కె.రామాపురంలో ఉండే సుబ్బమ్మ.. తన కోడలు వసుంధర తల నరికి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. వసుంధరను.. పక్కా పథకం ప్రకారం సుబ్బమ్మ తన ఇంటికి భోజనానికి పిలిచింది. అప్పటికే ఇంట్లో మాటు వేసి ఉన్న కొందరితో కలిసి.. దారణంగా తల నరికేశారు. అనంతరం.. తలను పట్టుకుని సుబ్బమ్మ అర కిలోమీటర్ దూరంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఈ దృశ్యాన్నిచూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. వివాహేతర సంబంధం, ఆస్తి తగాదాలే హత్యకు కారణమై ఉంటాయని అనుమానిస్తున్నారు.
ఇవీ చదవండి: