ETV Bharat / crime

బీ అలర్ట్​: డెబిట్‌, క్రెడిట్‌ కార్డుదారులకు సైబర్‌ నేరస్థుల కొత్త గాలం - మంకీ సర్వే యాప్​ద్వారా సైబర్​ క్రైం మోసాలు

ప్రభుత్వ సంస్థల పనితీరు, ప్రజాభిప్రాయం, రాజకీయనేతల ప్రస్తుత, భవిష్యత్‌పై సర్వేలు నిర్వహిస్తున్న ‘మంకీ సర్వే’ యాప్‌ను(monkey survey app) మోసాలకు వినియోగిస్తున్నారు. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ వంటి బ్యాంకుల కస్టమర్‌ కేర్‌, కేవైసీలను సంప్రదిస్తున్న వారికోసం అంతర్జాలం ద్వారా గాలం వేసి లక్షలు కాజేస్తున్నారు.

cyber
cyber
author img

By

Published : Sep 26, 2021, 9:13 AM IST

‘‘హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఉంటున్న బల్వీందర్‌ సింగ్‌.. తన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఖాతాలో(indus bank account) లావాదేవీలపై సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అంతర్జాలంలో ఉన్న కస్టమర్‌ కేర్‌ నంబరుకు ఫోన్‌ చేశారు. అది సైబర్‌ నేరస్థులు ఉంచిన నకిలీ నంబరని తెలియదు. అవతలి వ్యక్తులు ‘మంకీ సర్వే’ (monkey survey app) యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని బల్వీందర్‌కు చెప్పారు. తర్వాత డెబిట్‌ కార్డు వివరాలు పూర్తి చేయించి.. ఓటీపీ చెప్పమన్నారు. బల్వీందర్‌ ఓటీపీ చెప్పగానే ఆయన ఖాతాలోంచి రూ.4.5 లక్షలు నగదు మాయమైంది’’ ఇలా డెబిట్‌, క్రెడిట్‌ కార్డుదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ నేరస్థులు వంచనకు దిగుతున్నారు.

స్కాం సూత్రం ఇదే..

ప్రభుత్వ సంస్థల పనితీరు, ప్రజాభిప్రాయం, రాజకీయనేతల ప్రస్తుత, భవిష్యత్‌పై సర్వేలు నిర్వహిస్తున్న ‘మంకీ సర్వే’ యాప్‌ను మోసాలకు వినియోగిస్తున్నారు. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ వంటి బ్యాంకుల కస్టమర్‌ కేర్‌, కేవైసీలను సంప్రదిస్తున్న వారికోసం అంతర్జాలంలో ఆ బ్యాంకుల తరహాలోనే టోల్‌ఫ్రీ నంబర్లను ఉంచుతున్నారు. ఈ నంబర్లకు ఫోన్‌ చేసిన వెంటనే స్పందించి.. మంకీ సర్వే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయిస్తున్నారు. ఆ యాప్‌లో ఒక ఫారంలా ఉన్న డిజిటల్‌ కాగితంలో పేరు, డెబిట్‌కార్డు నంబరు, సీవీవీ ఇలా అన్ని వివరాలను పూర్తిచేశాక ఆ ఫారాన్ని పంపమంటున్నారు. ఆ వివరాలను తీసుకుని నగదు బదిలీ, ప్రముఖ కంపెనీల బ్రాండెడ్‌ వస్తువుల ఓచర్లను బాధితుల ఓటీపీలతో కొనుగోలు చేస్తున్నారు. బెంగళూరు, ముంబయి నగరాల్లో కొద్దిరోజుల్లోనే 35 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.

కార్డు, సీవీవీ వివరాలు ఇవ్వొద్దు

కస్టమర్‌ కేర్‌ ప్రతినిధుల్లా మాట్లాడుతోంది బ్యాంకు అధికారులా? కాదా? తెలుసుకోండి... వినియోగదారుల సేవాకేంద్రం ప్రతినిధులు మీ డెబిట్‌కార్డు నంబరు, పేరు తప్ప ఇతర వివరాలు తీసుకోరు. ఏటీఎంకార్డు వ్యవహారాలు ఆన్‌లైన్‌, బ్యాంకుల్లోనే తెలుసుకునే సౌకర్యం ఉంది. మీకు అనుమానం వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి. -అవినాష్‌ మహంతి, సంయుక్త కమిషనర్‌ (నేర పరిశోధన).

ఇదీ చూడండి: పెరుగుతున్న సైబర్​ నేరాలు.. ఏడాది కాలంలో ఐదింతలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.