ETV Bharat / crime

పోలీసులపై దుష్ప్రచారం.. ఇద్దరు అరెస్ట్ - తెలంగాణ పోలీసులపై ఆరోపణలు

పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకొని కొందరు దుష్ప్రచారం చేస్తున్న ఇద్దరిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అసత్య ప్రచారాలు చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

slandering police on social media.
పోలీసులపై దుష్ప్రచారం
author img

By

Published : May 25, 2021, 7:26 PM IST

సామాజిక మాధ్యమాల్లో పోలీసులపై దుష్ప్రచారం చేస్తోన్న ఇద్దరు వ్యక్తులపై సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని పుణేలో జరిగిన ఓ సంఘటనను.. తెలంగాణలో జరిగినట్లుగా ట్విట్టర్​లో అసత్య ప్రచారం చేసినందుకు గాను హైదరాబాద్​కు చెందిన సోమరాజు, జీవన్ అనే ఇద్దరని అరెస్ట్ చేశారు.

తెలంగాణ పోలీసులపై అవమానకరమైన పోస్టులు పెట్టి షేరింగ్​లకు పాల్పడుతోన్న వీరిపై ఓ పోలీసు​ అధికారి.. సైబర్ క్రైమ్​కు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. సోషల్ మీడియాలో ఈ తరహా అసత్య ప్రచారాలు చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ హెచ్చరించారు.

ఇదీ చదవండి: 90 ఏళ్ల వృద్ధురాలిని భుజాలపై మోసుకెళ్లిన పోలీసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.