'మద్యం సేవించి, రాంగ్ రూట్లో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కాకండి.. ఇతరులను అవస్థలకు గురి చేయకండి' అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి వై జంక్షన్లో ఈ నెల 11న అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వేగంగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొనటంతో వాహనదారులకు గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఉండి రాంగ్ రూట్లో వచ్చిన వ్యక్తి మరో బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో కూకట్‌పల్లి ఎల్లమ్మ బండ ప్రాంతానికి చెందిన గొల్లమండ్ల త్రిప్రసాద్(24)కు కాలు విరిగింది. త్రిప్రసాద్ బాలానగర్‌లోని ఓ ల్యాబ్‌లో కొవిడ్ శాంపిల్స్ ఇచ్చి తిరిగి వస్తుండగా.. మద్యం మత్తులో ఉన్న మరో వ్యక్తి అపసవ్య దిశలో రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీటీవీ దృశ్యాలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేయటంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. 12న త్రిప్రసాద్ కుటుంబ సభ్యులు కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు..
-
Driving under the influence of Alcohol; Driving in opposite direction; Driving without Driving License by both the riders.
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) May 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
A non-fatal accident at Kukatpally Y junction.#RoadSafetyCyberabad #RoadSafety pic.twitter.com/F1GjNj24pI
">Driving under the influence of Alcohol; Driving in opposite direction; Driving without Driving License by both the riders.
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) May 19, 2021
A non-fatal accident at Kukatpally Y junction.#RoadSafetyCyberabad #RoadSafety pic.twitter.com/F1GjNj24pIDriving under the influence of Alcohol; Driving in opposite direction; Driving without Driving License by both the riders.
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) May 19, 2021
A non-fatal accident at Kukatpally Y junction.#RoadSafetyCyberabad #RoadSafety pic.twitter.com/F1GjNj24pI
ఇదీ చదవండి: యథేచ్ఛగా సాగుతోన్న అక్రమ మట్టి తవ్వకాల దందా..!