ETV Bharat / crime

సైబర్ మోసం: ఇంటెలిజెన్స్ అధికారిణికే టోకరా !

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు పేట్రేగిపోతున్నారు. సాధారణ వ్యక్తులనే కాదు.., ఏకంగా ఓ ఇంటిలిజెన్స్ అధికారిణినే బురిడీ కొట్టించారు. కస్టమర్ కేర్ పేరుతో రూ. 1.60 లక్షలు కాజేశారు.

cyber Fraud, intelligence officer
సైబర్ మోసం: ఇంటెలిజెన్స్ అధికారిణికే టోకరా !
author img

By

Published : Apr 6, 2021, 7:27 AM IST

సైబర్ నేరగాళ్లు ఓ ఇంటెలిజెన్స్ అధికారిణినే బురిడీ కొట్టించారు. కస్టమర్ కేర్ పేరుతో రూ. 1.60 లక్షలు కాజేశారు. విజయవాడకు చెందిన ఓ ఇంటెలిజెన్స్ అధికారిణి మేక్ మై ట్రిప్ ద్వారా విమాన టికెట్లు రిజర్వ్ చేసింది. అనంతరం ప్రయాణ తేదీలను మార్చుకోవటం కోసం గూగుల్​లో కస్టమర్ కేర్​ నంబర్ వెతికారు. నంబర్‌ సంపాదించి ఫోన్‌ చేయగా ఆ కాల్‌ మధ్యలోనే కట్‌ అయింది.

ఆ తరువాత ఆమెకు మరో నంబరు నుంచి సైబర్‌ నేరగాళ్లు వల విసిరారు. మేక్‌ మై ట్రిప్‌ కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నామని, ఏం సాయం కావాలో చెప్పాలని కోరారు. ఆమె సమస్యను మొత్తం వారికి వివరించడంతో.. మీ చరవాణికి ఓ లింక్‌ పంపిస్తామని దాని ద్వారా తేదీలను మార్చుకోవచ్చని చెప్పుకొచ్చారు. ఇంతలో చరవాణికి వచ్చిన లింక్‌ను ఆమె క్లిక్‌ చేయడంతో ఆ నంబర్‌కు లింకైన బ్యాంకు ఖాతా నుంచి రూ.1.60 లక్షలు మాయమయ్యాయి. దీనిపై వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కస్టమర్ కేర్ నెంబర్​కు ఫోన్ చేసి 1.50 లక్షలు రికవరీ చేశారు.

ఇదీ చూడండి: సైబర్ బీమా గురించి ఇవి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.