ETV Bharat / crime

మీకు ఇలాంటి కాల్స్​ వస్తున్నాయా.. అయితే ఆలోచించాల్సిందేే..! - మహబూబ్​నగర్ జిల్లా తాజా నేర వార్తలు

CYBER FRAUDS: హైదరాబాద్‌ వంటి మహానగరాలతోపాటు ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ.. సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో రోజు ఏదో ఓ మూల సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి జనం మోసపోతున్నారు. ఉద్యోగాలు, బహుమతి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం అంటూ సందేశాలు పంపుతున్న కేటుగాళ్ల ఆగడాలకు బాధితులు బలవుతున్నారు.

సైబర్‌ నేరాలు
సైబర్‌ నేరాలు
author img

By

Published : Aug 1, 2022, 5:48 PM IST

మీకు ఇలాంటి కాల్స్​ వస్తున్నాయా.. అయితే ఆలోచించాల్సిందేే..!

CYBER FRAUDS: ఉద్యోగాల కోసం కొందరు, ఇంట్లోనే ఉండి ఆదాయం పొందాలని మరికొందరు.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించాలన్న దురాశతో ఇంకొందరు ఇలా సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు. నకిలీ వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ లింకులు, ఫేక్‌ఫోన్‌కాల్స్‌కు ఆకర్షితులై డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వందలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళలు.. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుపోయారు.

ఉమ్మడి జిల్లాలో నెలకు కనీసం 150కిపైగా సైబర్‌ నేరాలకేసులు నమోదు అవుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. సైబర్ నేరాల్లో మోసం జరిగిన 24 గంటల్లోపు బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేయకపోవడంతో విచారణకష్టంగా మారుతోంది. మోసపోయినట్లు తెలిస్తే నలుగురిలో నవ్వులపాలు అవుతామని ఎక్కవమంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఆ జాప్యం వల్ల పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టడం కష్టంగా మారుతోంది. కాజేసిన 24 గంటల్లోపు ఫిర్యాదుచేస్తే పొగొట్టుకున్న డబ్బుని తిరిగిస్తామని పోలీసులు హామీ ఇస్తున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏడాదికాలంగా 437ఆన్‌లైన్ మోసాలఫిర్యాదులు రాగా వాటిలో 40మందికి డబ్బులు తిరిగి ఇప్పించారు. వనపర్తి జిల్లాలో ఈ ఏడాది 12 సైబర్‌ కేసులు నమోదుకాగా.. బాధితులు నాలుగున్నర లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. అందులో రెండున్నర లక్షల రూపాయలు తిరిగి ఇప్పించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రూ.52లక్షలు కాజేయగా రూ.11లక్షలు రికవరీ చేశారు. రూ.17లక్షలు స్తంభింపజేశారు. గద్వాల జిల్లాలో ధని పుట్‌బాల్‌ గేమింగ్‌ యాప్‌ ద్వారా మోసపోయినట్టు ఫిర్యాదులు అందాయి. 95 ఫిర్యాదుల్లో రూ.24లక్షల కొల్లగొట్టగా.. రూ.73వేలు ఖాతాల్లోంచి వెళ్లకుండా ఆపగలిగారు. రూ.30వేలు రికవరీ చేశారు. నారాయణపేట జిల్లాలోనూ 95 ఫిర్యాదుల్లో రూ.3లక్షలు స్తంభింపజేశారు.

తప్పుడువివరాలతో బ్యాంకుఖాతాలు, ఏజెన్సీలు ఏర్పాటుచేస్తున్న నేరగాళ్లు.. వారు దోచిన సొమ్మును అందులోకి మళ్లిస్తున్నారు. బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటిరాష్ట్రాలే సైబర్‌నేరాలకు అడ్డాగా మారాయి. అక్కడి బ్యాంకుల నుంచి సొమ్ము రికవరీ ఆలస్యమవుతోంది. సైబర్‌నేరాలపై ప్రజలకు అవగాహన లేకపోవడమే ఈ తరహా మోసాలకు ప్రధాన కారణమని పోలీసులు అంటున్నారు. అందుకోసం ప్రత్యేక అధికారులతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి జిల్లాలో సైబర్ ఇన్‌స్పెక్టర్లతోపాటు ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో సైబర్ వారియర్స్‌లను నియమిస్తున్నారు.

ఇవీ చదవండి : కుమార్తెను చంపి.. సహజ మరణంగా చిత్రీకరించిన తల్లి

దళిత మహిళపై లైంగిక వేధింపులు.. తుపాకీతో బెదిరించి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.