'ఇప్పుడుకాక ఇంకెప్పుడు'(ippudu kaka inkeppudu movie) సినిమాపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు(cyber crime police) కేసు నమోదు చేసినట్లు ఏసీపీ ప్రసాద్ తెలిపారు. ఈ సినిమా ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ సినిమాతో హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆన్‌లైన్‌లో ఫిర్యాదు రాగా... సుమోటోగా స్వీకరించినట్లు వెల్లడించారు. కొన్ని డైలాగులు, సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. 67 IT యాక్ట్, 295 IPC సెక్షన్ కింద కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నట్లు ప్రసాద్ వివరించారు.
యువ నటీనటులు హస్వంత్ వంగ, నమ్రతా దరేకర్ , వశిష్ట చౌదరి ప్రధాన పాత్రల్లో వై .యుగంధర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ఓ శృంగార సన్నివేశంలో భజగోవిందం అనే పాట... పలువురి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని భావించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
'ఇప్పుడుకాక ఇంకెప్పుడు' సినిమా ప్రోమో సోమవారం విడుదలైంది. అందులో హిందూ మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆన్‌లైన్‌లో ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదుదారుల వివరాలు లేకపోవడం వల్ల... సుమోటోగా స్వీకరించాం. కొన్ని డైలాగులు, సన్నివేశాలు, పాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి. అందుకే 67 ఐటీ యాక్ట్(IT ACT), 295 ఐపీసీ(IPC) సెక్షన్ కింద కేసు నమోదు చేశాం.
-ప్రసాద్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ
ఇదీ చదవండి: TRAINEE WOMAN SI COMPLAINT: మహిళా ట్రైనీ ఎస్సైని అడవుల్లోకి తీసుకెళ్లి... !