ETV Bharat / crime

Cyber Crime: నకిలీ కాల్ సెంటర్ ముఠా అరెస్ట్.. రూ.కోటి 11 లక్షలు స్వాధీనం

Cyber Crime: అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ సైబర్​క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.కోటి 11 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్​ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. సుమారు 50 కోట్ల మేర మోసం జరిగినట్లు అనుమానిస్తున్నట్లు చెప్పారు.

Cyber Crime
నకిలీ కాల్ సెంటర్ ముఠాను అరెస్ట్
author img

By

Published : Jan 13, 2022, 2:30 PM IST

Updated : Jan 13, 2022, 4:26 PM IST

అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ సైబర్​క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురు నిందితులను అరెస్ట్​ చేశారు. వారి నుంచి కోటి 11 లక్షల రూపాయల నగదు, లాప్​ట్యాప్​లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను సైబరాబాద్​ సీపీ స్టీఫెన్​ రవీంద్ర వెల్లడించారు.

మాదాపూర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని హెల్తీ డెంటల్​ క్లీనిక్​లో కేవలం 5 రోజుల వ్యవధిలోనే క్రెడిట్ కార్డుల నుంచి 64 లక్షల రూపాయల లావాదేవీలు జరిగాయి. అన్ని ఇంటర్నేషనల్​ క్రెడిట్ కార్డులు కావడం వల్ల అనుమానం వచ్చి.. సదరు హెల్తీ డెంటల్ క్లీనిక్ ప్రతినిధిని హెచ్​డీఎఫ్​సీ అధికారులు వివరాలు అడిగారు. సరైన పత్రాలు సమర్పించకపోవడంతో హెచ్​డీఎఫ్​సీ అధికారులు.. సైబర్​ పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసునమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మొహాలీ, గజియాబాద్​, దిల్లీలో కాల్​ సెంటర్లు ఏర్పాటుచేసి మోసాలకు పాల్పడినట్లు గుర్తించామని సీపీ స్టీఫెన్​ రవీంద్ర చెప్పారు.

రూ.50 కోట్ల మోసం..

ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్​.. ఆర్​ఎన్​ టెక్నాలజీ పేరుతో ఓ సంస్థను స్థాపించినట్లు సీపీ తెలిపారు. ఆ సంస్థ ద్వారా పలు ఆన్​లైన్​ సర్వీసులను అందిస్తున్నట్లు.. నిందితుడు నవీన్​ గూగుల్​లో ప్రకటన ఇచ్చినట్లు చెప్పారు. కొంత మంది టెలీకాలర్లను నియమించుకొని.. సర్వీస్​ పేరుతో వినియోగదారుల క్రెడిట్​కార్డు, సీవీసీ నంబర్​, ఓటీపీ తెలుసుకొనేవారని సీపీ పేర్కొన్నారు. వాటి సాయంతో హైదరాబాద్, దిల్లీ, పంజాబ్​లో నగదును విత్​డ్రా చేసుకున్నారని సీపీ స్టీఫెన్​ రవీంద్ర చెప్పారు. 2018 నుంచి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు తేలిందని.. దాదాపు 50 కోట్ల వరకు మోసం చేసినట్లు అనుమానిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.

'విదేశీ క్రెడిట్ కార్డ్ కంపెనీలకు ఫ్రాంచైజీగా ఉన్న భారతీయ బ్యాంకులకు టోకరా వేస్తుంది. దీనిపై ఫిర్యాదులు రావడంతో.. దర్యాప్తు చేపట్టాం. 80 మందితో నకిలీ కాల్​సెంటర్​ నిర్వహిస్తున్నట్లు గుర్తించాం. మరో రెండు ముఠాలు దుబాయ్​ నుంచి.. పని చేస్తున్నట్లు తెలిసింది. పక్కా ప్రణాళికతో.. నకిలీ కాల్​ సెంటర్​పై దాడి చేసి.. ఏడుగురుని అరెస్ట్ చేశాం'

-సైబరాబాద్​ సీపీ స్టీఫెన్​ రవీంద్

నకిలీ కాల్ సెంటర్ ముఠా అరెస్ట్.. రూ.కోటి 11 లక్షలు స్వాధీనం

ఇదీ చూడండి: Cyberabad CP: 'బ్యాంకు అధికారులమని.. రూ.3కోట్లు దోచేశారు''

Last Updated : Jan 13, 2022, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.