ETV Bharat / crime

SUICIDE: తుపాకీతో కాల్చుకుని సీఆర్​పీఎఫ్ కానిస్టేబుల్​ ఆత్మహత్య - constable suicide news

కుటుంబ కలహాల కారణంగా ఓ సీఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గుజరాత్​కు చెందిన ఠాకూర్​ శంకర్​.. మియాపూర్​ నడిగడ్డ తండా సమీప క్యాంపులో విధులు నిర్వహిస్తున్నాడు. శంకర్​ భార్య కూడా సీఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్ కాగా... ఇద్దరి మధ్య చోటుచేసుకున్న ఘర్షణలే ఆత్మహత్యకు కారణమా..? అని పోలీసులు అనుమానిస్తున్నారు​.

crpf constable suicide with gun firing in hyderabad

author img

By

Published : Jul 21, 2021, 8:00 PM IST

హైదరాబాద్​లోని సీఆర్​పీఎఫ్​ క్యాంపులో విషాదం చోటుచేసుకుంది. తుపాకీతో కాల్చుకుని సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. గుజరాత్​కు చెందిన సీఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​ ఠాకూర్​ శంకర్​ మియాపూర్ నడిగడ్డ తండా సమీప క్యాంపులో విధులు నిర్వహిస్తున్నాడు. క్యాంపులో ఎవరూ లేని సమయంలో శంకర్​... ఎస్​ఎల్​ఆర్​ రైఫిల్​తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

భార్యాభర్తల మధ్య గొడవలు...!

ఠాకూర్​ శంకర్​ భార్య కూడా సీఆర్​పీఎఫ్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తోంది. శంకర్​కు తన భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయని సహచరులు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధరించినట్లు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారని... ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారని సీఆర్​పీఎఫ్​ ఐజీ మహేశ్ చంద్ర లడ్హా తెలిపారు.

తుపాకీతో కాల్చుకుని సీఆర్​పీఎఫ్ కానిస్టేబుల్​ ఆత్మహత్య

ఇదీ చూడండి: Son murdered father: రూ.200 ఇవ్వలేదని తండ్రినే చంపేశాడు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.