కామారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. గోసాంగికాలనీకి చెందిన దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పట్టణానికి చెందిన సాయిలు(40), పోచవ్వ(35).. ఈ నెల 28 న ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అప్పటి నుంచి ఆచూకీ లేని దంపతులు.. విగతజీవులుగా కనిపించారు. కాలిన స్థితిలో సాయిలు మృతదేహం లభ్యమైంది. ఆ పక్కనే నీటిగుంతలో భార్య పోచవ్వ మృతదేహం కనిపించింది. దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: