Farmer suicide: ఒక వైపు పత్తికి మంచి ధర వస్తుండగా.. పత్తి సాగు చేసిన రైతు దిగుబడి సరిగా రాక.. చేసిన అప్పులు తీర్చే దారి లేక బలవన్మరణానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బోడియా తండాలో చోటుచేసుకుంది.
బోడియాతండాకు చెందిన రైతు లక్ష్మ(60) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మ తనకున్న 5 ఎకరాలతో పాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. అప్పు చేసి పది ఎకరాల్లో పత్తి, కంది సాగు చేయగా దిగుబడి అంతగా రాలేదు. పంట కోసం పదిహేను లక్షల దాకా అప్పు కావడం, అప్పు తీర్చే మార్గం కనిపించకపోవడంతో పొలం వద్ద పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇల్లందు వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కౌలుకు తీసుకున్న భూమిలో సాగు చేశామని.. దిగుబడి సరిగా రాకపోవడం తమ కుటుంబానికి తీరని ఆవేదనను మిగిల్చిందని కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతం అవుతున్నాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: