రాష్ట్రాన్ని మరోసారి కరోనా మహమ్మారి భయపెడుతున్న వేళ వైరస్ నిర్ధరణ పరీక్షలకు ఉపయోగించిన కిట్లు రోడ్డు పక్కన పడేయడం ఆందోళన కలిగిస్తోంది.పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలో పోచమ్మ వాడ ప్రాంతంలో కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలకు వినియోగించిన కిట్లను గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన పడేశారు.
దీంతో ఆ రహదారిపై వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మంథని ప్రాంతంలో కరోనా నిర్ధరణ పరీక్షలు కేవలం ఏఎన్ఎమ్లు, ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే చేస్తున్నారు. ఈ కిట్లను ఎవరు పడవేశారనే విషయాన్ని అధికారులు విచారణ చేసి... బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: కరోనా నిబంధనలు మరింత కఠినతరం.. నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్