విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గమనించిన తోటి కార్మికులు, కుటుంబ సభ్యులు బాధితున్ని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు.
ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బుద్దారం గ్రామానికి చెందిన వీరన్న(26) జీవనోపాధి కోసం భార్యాపిల్లలతో కలిసి ఏడాదిన్నర క్రితం నగరానికి వలస వచ్చాడు. పంజాగుట్ట ఠాణా పరిధిలోని బీస్ మక్తా ప్రాంతలో గతంలో నిర్మించిన భవనంపై మరో రెండు అంతస్తులు నిర్మిస్తున్నారు. ఈ పనిలో భాగంగా ఇనుపరాడ్‌లు పైకి తెస్తోన్న క్రమంలో కరెంట్ షాక్కు గురై వీరన్న తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే తోటి కార్మికులు అతన్ని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని స్నేహితులు, బంధువులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ తరలించారు. మృతుడికి భార్య వీరమ్మ, ఏడాదిన్నర వయసున్న కుమార్తె ఉన్నారు.
ఇదీ చదవండి: కూలిన కలెక్టరేట్ సెంట్రింగ్... తొమ్మిది మందికి గాయాలు