ETV Bharat / crime

ఎల్‌బీనగర్‌ కూడలిలో కాంగ్రెస్‌ కార్యకర్త ఆత్మహత్యాయత్నం - congress worker suicide

Congress
Congress
author img

By

Published : Oct 2, 2021, 6:33 PM IST

Updated : Oct 2, 2021, 7:50 PM IST

18:32 October 02

ఎల్‌బీనగర్‌ కూడలిలో కాంగ్రెస్‌ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ పిలుపునిచ్చిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల అనుమతి లేకున్నా చేసి తీరుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో రేవంత్ నివాసం, దిల్​సుఖ్​నగర్​లో పోలీసులు భారీగా మోహరించారు. ర్యాలీ కోసం వచ్చిన కాంగ్రెస్​ కార్యరక్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. 

       ఇదే సమయంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుల కన్నుగప్పి ఎల్బీ నగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్‌ పోసుకుని కల్యాణ్‌ అనే విద్యార్థి బలవన్మరణానికి యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. 

ఇదీ చదవండి : REVANTH REDDY: 'తెలంగాణ ఇంకెంతో కాలం కేసీఆర్‌ చేతిలో బందీగా ఉండదు'

Last Updated : Oct 2, 2021, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.