హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ యువకుడిని చితకబాదారు. ప్రశాంత్ అనే యువకుడిని మరో గ్యాంగ్ కర్రలతో కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఆదివారం రాత్రి ఓ సెటిల్మెంట్ వ్యవహారంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఓ వర్గం మరో వర్గంపై దాడి చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఇరు వర్గాలను విచారిస్తున్నారు. తరచూ ఈ గ్యాంగ్ గొడవలతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చూడండి: కూలర్ల ఆటోలో మంటలు.. తప్పిన ప్రమాదం!