బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవలో మోయిన్ అనే వ్యక్తి మృతి చెందాడు. బేగంపేట పాటిగడ్డలో నివాసం ఉంటున్న ముగ్దుమ్, మోయిన్లు స్నేహితులు. బుధవారం రాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో గొడవ కాస్తా పెద్దదై.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మోయిన్ తలపై ముగ్దుమ్ రాడ్డుతో బలంగా బాదాడు. తలకు తీవ్ర గాయాలైన క్షతగాత్రుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మోయిన్ మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడు ముగ్దుమ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.