ETV Bharat / crime

SHE TEAM: మీరు ధైర్యంగా చెప్పండి.. మేము శిక్షిస్తాం! - షీ టీమ్ ఫిర్యాదులు

తరతరాలుగా వేళ్లూనుకుపోయిన సమాజ కట్టుబాట్లను ఛేదించుకొని- విద్య ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొని వనితాలోకం.. ఇప్పుడిప్పుడే హక్కులు, సమానత్వం, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు సమాజంలో పెరుగుతున్న పెడధోరణులు వారి ప్రగతికి అవరోధంగా మారడమే కాకుండా.. ఎందరినో బలి తీసుకుంటున్నాయి. పని ప్రదేశంలో మహిళలపై వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. కేవలం ప్రైవేటు సంస్థల్లోనే కాదు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మహిళలపై వేధింపులు తగ్గట్లేదు.

SHE TEAM
షీ బృందాలు
author img

By

Published : Jul 13, 2021, 12:08 PM IST

‘వారం రోజుల నుంచి మా కార్యాలయంలో పనిచేసే వ్యక్తి వేధిస్తున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో తక్కువ మంది విధులు నిర్వహిస్తున్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు. నీతో ఒంటరిగా మాట్లాడాలి.. నేను చెప్పిన సమయానికి రాకపోతే నీ ఫొటోలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తానంటూ రెండురోజుల కిందట చెప్పాడు. స్పందించకపోవడంతో తీవ్రంగా హెచ్చరించడమే కాకుండా నా ఫొటో ఫేస్‌బుక్‌లో ఉంచి అసభ్యంగా ప్రచారం చేశాడు. నేను ఫిర్యాదు ఇస్తా.. అతడిని శిక్షించండి.’

కొద్దిరోజుల కిందట భరోసా కేంద్రానికి వచ్చిన యువతి పోలీసులతో అన్నమాటలివి. వెంటనే స్పందించిన ‘షి’బృందం సభ్యులు గంటల వ్యవధిలో నిందితుడిని పట్టుకున్నారు. ఆమెను వేధించిన యువకుడికి పోలీసు శైలిలో బుద్ధి చెప్పారు. మరోసారి బాధితురాలి జోలికి రాకుండా అరెస్టు చేసి జైలుకు పంపించారు. పోలీసులు స్పందిస్తుండటంతో కళాశాలలు.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న యువతులు, మహిళలు నేరుగా భరోసా కేంద్రాలకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. వీరు నేరుగా వస్తున్నా.. బాధితులకు భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా పోలీసులు వారి పేర్లను గోప్యంగా ఉంచుతున్నారు.

మీ స్పందన నేరాలకు అడ్డుకట్ట

లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వారు వెంటనే స్పందించాలి. మిమ్మల్ని వేధిస్తున్న వారికి బుద్ధి చెప్పాలని గట్టిగా నిర్ణయించుకోండి. మీ స్పందన ద్వారా నేరాలకు అడ్డుకట్ట పడుతుంది. ఈవ్‌ టీజింగ్‌ బాధితులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వారికి జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేస్తున్నారు. మీ ఆవేదనను ‘షి’బృందాలకు చెప్తే చాలు... చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నిందితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. బాధితులకు మేం భరోసా ఇస్తున్నందుకే ఫిర్యాదులు క్రమంగా పెరుగుతున్నాయి.

-షికాగోయల్‌, అదనపు పోలీసు కమిషనర్‌ (నేర పరిశోధన)

ఫిర్యాదుల వివరాలు

హింసిస్తూ... భయపెడుతూ...

యువతులు, విద్యార్థినులు, మహిళలను కొందరు పోకిరీలు, ఈవ్‌ టీజర్లు వెంటపడుతూ వేధిస్తున్నారు. చరవాణులు, అంతర్జాల ఆధారిత యాప్‌లతో వారి వివరాలు తెలుసుకొని బెదిరిస్తున్నారు. పరిచయస్తుల పేరు, ఫోన్‌ నంబరుంటే చాలు... అసభ్యంగా మాట్లాడుతున్నారు. మరికొందరు అర్ధరాత్రి దాటాక ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు విరామం లేకుండా ఫోన్లు చేస్తూ హింసిస్తున్నారు. ఇలాంటి చిత్రహింసలు ఎదుర్కొంటున్న వారిలో కొందరు వృత్తి నిపుణులు కూడా ఉన్నారు. దీంతో బాధితులకు న్యాయం చేసేందుకు పోలీసులు ప్రతి ఫిర్యాదును క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.

మార్పు కోసం

మహిళలపట్ల మగవారి ఆలోచనాధోరణి మారాలి. చట్టాలు ఉన్నంత మాత్రాన సరిపోదు. అవి పటిష్ఠంగా అమలు కావాలి. అందరికీ సత్వర న్యాయం, జవాబుదారీతనం అనివార్యం. స్త్రీ శక్తిని, సృజనాత్మకతను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యే ఏ సమాజమైనా అభివృద్ధిలో వెనకబడే ఉంటుందనే వాస్తవాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. వారిని అభివృద్ధిలో కీలక భాగస్వాములను చేయాలి. మహిళలను గౌరవించడం, వారికి భద్రత కల్పించడం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. పౌరులంతా దాన్ని తమ ఉమ్మడి బాధ్యతగా భావించాలి. అప్పుడే మహిళలపై హత్యాచారాలు, దమన కాండ తగ్గుముఖం పడతాయి.

ఇదీ చూడండి: పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు- ఆపేదెలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.