ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ యువతి హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2018లో అపోలో ఫార్మసీలో ఉద్యోగంలో చేరగా.. అక్కడే సూపర్వైజర్గా పనిచేస్తోన్న కొండబాబు అనే వ్యక్తితో పరిచయమేర్పడిందని బాధితురాలు తెలిపింది. మొదట స్నేహం పేరుతో మాటలు కలిపిన కొండబాబు.. ప్రేమ అంటూ వెంట పడ్డాడని.. వివాహం చేసుకుంటానని నమ్మించాడని వాపోయింది.
కొన్ని రోజుల తర్వాత.. తనకు ఇంతకుముందే పెళ్లైందని.. పిల్లలున్నారని తెలిసిందని పేర్కొంది. అదే విషయమై నిలదీయగా.. తన భార్యకు విడాకులిస్తానని నమ్మించాడని తెలిపింది. మాయమాటలు చెప్పి పార్కులు, హోటళ్లు తిప్పి.. లైంగిక వాంఛ తీర్చుకున్నాడని ఆరోపించింది. వివాహం విషయం ప్రస్తావించగా.. తనను పట్టించుకోవటం మానేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. మోసం పోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: