ఖమ్మం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రమణగుట్టలో కాంగ్రెస్, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తెరాస కార్యకర్తలు, వీఆర్వో కలిసి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నారు. స్థానిక కార్పొరేటర్‌కు సమాచారం ఇవ్వకుండా చెక్కులు ఎలా అందిస్తారని కాంగ్రెస్ కార్యకర్తలు వారిని ప్రశ్నించారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం ముదిరి.. కర్రలతో దాడి చేసుకున్నారు. ఘటనలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తల తలలు పగిలాయి. అనంతరం ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసుకున్నారు.
ఇదీ చూడండి: సుల్తాన్‌బజార్ ప్రభుత్వాస్పత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ మృతి