కొంతకాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా సీసీఎస్, చౌటుప్పల్ పోలీసులు పట్టుకున్నారు. లింగోటం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చౌటుప్పల్లోని మరో ఇద్దరు యువకులతో కలిసి పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను చోరీ చేసే వారని ఏసీపీ సత్తయ్య తెలిపారు. వాటిని తక్కువ ధరకు అమ్మి, వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారని అన్నారు.
జిల్లాలో ఇటీవల ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులు పెరగడంతో... పంతంగి టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహించగా ఈ ముఠా పట్టుబడినట్లు వెల్లడించారు. వారి నుంచి 7 బైక్లు, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'బీడీ కార్మికులకు జీవనభృతి చెల్లించాలి'