ETV Bharat / crime

పెట్టుబడుల పేరుతో మోసం.. ఆ డబ్బంతా చైనాకు తరలింపు - చీటింగ్​ కేసులో చైనా ముఠా అరెస్ట్​

Chinese gang arrested for cheating in investments: పెట్టుబడులు పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్న కీలక నిందితులు పోలీసులకు చిక్కారు. చైనా దేశస్థుడు సహా మొత్తం 9 మందిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. వారిని కస్టడీకి తీసుకుని కీలక సమాచారం రాబడుతున్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను 5రోజుల పాటు పోలీసుల కస్టడీలో విచారిస్తున్నారు. దేశ వ్యాపంగా వందల కోట్ల రూపాయలను కాజేసిన నేరగాళ్ళు ఆ నగదును చైనా కు తరలిస్తున్నట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు.

cyber crime
సైబర్​ నేరం
author img

By

Published : Oct 12, 2022, 8:34 AM IST

Updated : Oct 12, 2022, 8:59 AM IST

Chinese gang arrested for cheating in investments: వివిధ రకాల పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తూ దేశ వ్యాప్తంగా సైబర్ క్రైం పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కీలక నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్​లో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు... దిల్లీలో నేరస్తులు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీతో పాటు పలు రకాల పెట్టుబడులు పేరుతో సెల్​ఫోన్​లకు సందేశాలు పంపుతున్న నిందితులు...స్పందించిన వారికి యాప్ డౌన్లోడ్ చేయిస్తున్నారు. అధిక లాభాలు వస్తాయంటూ పెట్టుబడి పెట్టిస్తున్నారు.

వచ్చిన లాభాలను నేరగాళ్లు వ్యాలెట్​లో చూపిస్తున్నారు. నమ్మిన తర్వాత ప్రజలు అధిక మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు. అనంతరం యాప్ ను డిలీట్ చేస్తున్నారు. ఇలా అధిక లాభాల కోసం పెట్టుబడి పెట్టి వారిని సైబర్ నేరగాళ్ళు దోచుకుంటున్నారు. ఈ సొమ్మంతా చైనాకు వెళతున్నట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. వాయిస్ ఓవర్... నిందితులు డిల్లిలో ఉన్నట్లు తెసుకున్న పోలీసులు...ప్రత్యేక సైబర్ క్రైం పోలీసు బృందం అక్కడికి వెళ్లి 5గురు డిల్లీ వాసులును గుర్తించి పట్టుకున్నారు.

వారంతా బిజినెస్ ఖాతాలు తెరిచి యాప్​లో కస్టమర్లు వేస్తున్న డబ్బు అందులోకి జమచేస్తున్నారు. అక్కడి నుంచి దిల్లీలో ఉంటున్న ముగ్గురు చైనా దేశస్థలు ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. వారి నుంచి వందల కోట్ల రూపాయలు చైనా దేశానికి వెళుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆదాయపు పన్ను శాఖ కూడా వ్యవహరంపై దృష్టి సారించింది. ఒక ఖాతా నుంచి నిబంధనలకు విరుద్దుంగా వేల లావాదేవీ వ్యవహారంపై ఆరా తీస్తోంది. విదేశాలకు నగదు తరలి వెళ్లింది.. కనుక ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ కూడా త్వరలో దృష్టి సారించే అవకాశం ఉంది.

ఈ కేసులో డిల్లీకి చెందిన 5గురు నిందితులకు, హైదరబాద్​కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఖాతాలు సమకూర్చినట్లు గుర్తించిన పోలీసులు...వారిని అరెస్ట్ చేశారు. మొత్తం ఈ కేసులో చైనాకు చెందిన చూలితో సహా 9 మందిని 10రోజుల సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. అనంతరం చులీతో పాటు దిల్లీకి చెందిన మరో ఇద్దరిని 5రోజుల కస్టడీకి కోర్టు అనుమతివ్వగా.. నేటితో కస్టడీ ముగియనుంది. ఈ కేసులో మరికొందరిని కూడా పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 12, 2022, 8:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.