ETV Bharat / crime

వివాహేతర సంబంధం ముందు తల్లి ప్రేమ నిలబడ లేదు... - నల్గొండలో డీఎస్​పీ ప్రస్​మీట్

Child murder case in Nalgonda district: ఈరోజుల్లో వివాహేతర సంబంధాలు అనే మాట ఎక్కువగా వింటున్నాం. ఈ సంబంధం వలన ఒక్కోసారి అన్యాయంగా ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ఇలానే నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. కన్నతల్లే తన కూతురుని చంపేసింది.

Child murder case in Nalgonda
అక్రమ సంబంధం ముందు తల్లి ప్రేమ నిలబడ లేదు
author img

By

Published : Dec 19, 2022, 10:19 PM IST

Child murder case in Nalgonda district: నల్గొండ జిల్లా నార్కట్​పల్లి పట్టణంలో చిన్నారి మృతి కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈనెల 14 న రెండేళ్ల వయస్సున్న ప్రియాన్షిక ఫిట్స్ వచ్చి చనిపోయిందని పోలీసులకు సమచారం అందింది. పరిశీలించగా గొంతు మీద గాయాలు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో పోలీసులు ఆశ్చర్యపోయే విషయం వెలుగుచూసింది.

డీఎస్పీ నరసింహా రెడ్డి కథనం ప్రకారం ఉయ్యాల వెంకన్నకు, చెట్ల రమ్యకి 2017లో వివాహం అయింది. వారికి శివరాం(5), ప్రియాన్షిక(2) ఇద్దరు పిల్లలున్నారు. వెంకన్న 2020లో కరోనాతో చనిపోయాడు. ఆ తరువాత రమ్య ఇద్దరు పిల్లలతో అత్తవారింట్లోనే ఉండేది. అదే గ్రామానికి చెందిన పెరిక వెంకన్నతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

పెరికి వెంకన్నకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మధ్య వ్యవహారం ఆమె అత్తమామలకు తెలిసింది. దీంతో వారు గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో సమస్యను పరిష్కరించమని కోరగా వారిద్దరిని హెచ్చరించారు. అయిన వారిలో ఎటువంటి మార్పు రాలేదు. రమ్య, వెంకన్న ఊరి విడిచి చిట్యాలలో రూం అద్దెకు తీసుకున్నారు.

అక్కడ కూడా వీరి బాగోతం అందరికి తెలియడంతో ఎవ్వరికి తెలియకుండా నార్కెట్​పల్లికి వెళ్లారు. పట్టణంలోని జీఎస్​ఆర్ ఫంక్షన్​ హాల్ ఎదురుగా ఒక ఇంట్లో పోర్షన్ అద్దెకు తీసుకున్నారు. అక్కడి వాళ్లకి వారు భార్యభర్తలమని, తమ గ్రామం నేరడం అని చెప్పారు. ఇలా ఆరు నెలలు గడిపారు. రూమ్​కి వెంకన్న వచ్చినప్పుడు ప్రియాన్షిక ఏడుస్తూ, భయపడేది. దీంతో వారి అక్రమ సంబంధానికి ఆటంకం వస్తోందని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొన్నారు.

ప్రణాళిక ప్రకారం ఈనెల 14న రాత్రి ఏడున్నర సమయంలో ఇద్దరు కలిసి గట్టిగా కొట్టి, ఊపిరి ఆడకుండా చేసి చంపారు. తరువాత ఫిట్స్ వచ్చి చనిపోయిందని అందరికి తెలిపారు. అయితే పోలీసులు అనుమానంతో దర్యాప్తుగా అసలు విషయం వెలుగు చూసింది. హత్యకేసును చేదించిన సీఐ శివరాం రెడ్డి, ఎస్సై రామకృష్ణలను డీఎస్పీ నరసింహారెడ్డి అభినందించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.