ETV Bharat / crime

చెడ్డీ గ్యాంగ్​కు ఐదేళ్లు జైలుశిక్షవిధించిన ఎల్బీనగర్​ కోర్టు - రంగారెడ్డి జిల్లా వార్తలు

రాష్ట్రంలో పలు దోపీడీలకు పాల్పడిన చెడ్డీ గ్యాంగ్​కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎల్బీనగర్ కోర్టు తీర్పు వెలువరించింది. పలు రాష్ట్రాల్లో రాత్రివేళల్లో చోరీలు చేస్తూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన నిందితులకు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది.

Cheddi gang convicts sentenced to five years in prison
చెడ్డీ గ్యాంగ్​కు ఐదేళ్లు జైలుశిక్ష
author img

By

Published : Apr 21, 2021, 5:13 AM IST

రాష్ట్రంతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్​కు రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ కోర్టు ఐదేళ్ళ జైలుశిక్ష విధించింది. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో రాత్రి వేళల్లో ఈ ముఠా చోరీలకు పాల్పడింది. ఉదయం దుప్పట్లు అమ్ముతున్నట్లు రెక్కీ చేసి రాత్రి వేళల్లో చెడ్డీలతో వచ్చి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

నగరంలోని సైబరాబాద్, రాచకొండ పరిధి, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో రాత్రి వేళల్లో ఈ ముఠా భారీగా చోరీలకు పాల్పడుతూ ప్రజలను హడలెత్తించారు. గతేడాది చెడ్డీ గ్యాంగ్​లో ఏడుగురిని పట్టుకున్న హయత్ నగర్ పోలీసులు వారి నుంచి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసును దర్యాప్తు చేసి సాక్ష్యాలు కోర్టుకు సమర్పించారు. విచారణ పూర్తి చేసిన ఎల్బీనగర్ కోర్టు నిందితులకు 5 ఏళ్ళ జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానా విధించింది.

ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రారంభం, రోడ్లు నిర్మానుష్యం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.