హైదరాబాద్ మెహిదీపట్నంకు చెందిన ఓ మహిళకు లాటరీలో కారు గెలిచారంటూ ఫోన్ వచ్చింది. కారు డెలివరీ కోసం డబ్బులు కట్టాలంటూ తెలుపగా... మహిళ అంగీకరించింది. వివిధ ఛార్జీల పేరుతో నేరగాళ్లు మహిళ నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేశారు.
డబ్బులు పంపించినప్పటికీ కారు రాకపోవడంతో... ఆమె మోసపోయినట్లు గ్రహించింది. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృత్యువాత.. పొలం పనులు చేస్తూనే..!