హైదరాబాద్ నిమ్స్(nims) ఆస్పత్రిలో మరో మోసం వెలుగు చూసింది. కొవిడ్ రోగుల(covid patients) కోసం కేటాయించిన పడకలను బ్లాక్‌లో నిమ్స్ వైద్యుడు అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్నాడు. దీనిపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బ్రోకర్లను పెట్టి బ్లాక్‌లో బెడ్స్ దందా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఇప్పటికే 60కి పైగా పడకలను అమ్ముకున్నట్లు నిమ్స్ అంతర్గత విచారణలో వెల్లడైంది.
నిమ్స్‌కు చెందిన ఓ డాక్టర్‌కు వ్యక్తిగత సహాయకుడిగా ఓ బ్రోకర్ పనిచేస్తున్నాడు. అతని సహాయంతో గుట్టు చప్పుడు కాకుండా పడకలను అమ్ముకొని లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నాడు. తాజాగా… నిమ్స్ ఆస్పత్రిలో బెడ్ ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి ఓ కొవిడ్ రోగి వద్ద బ్రోకర్ సహాయంతో రూ.లక్ష వసూలు చేసిన ఈ ఘటనపై కొందరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ డాక్టర్ ఎవరనే విషయం ఇంకా వెలుగులోకి రాలేదు. ఈ మోసంలో ఎంతమంది భాగస్వాములుగా ఉన్నారనే విషయం తేలాల్సి ఉంది.
ఇదీ చదవండి: Etv Bharat Effect: పదేళ్లుగా తీరని సమస్యకు పరిష్కారం