ETV Bharat / crime

అనుమానమే పెనుభూతం.. కుటుంబం ఆగం.. - తెలంగాణ క్రైమ్​ న్యూస్​

Chandanagar Murder Case Update: అనుమానం పెనుభూతమై భార్యతో పాటు పిల్లల్ని హత్య చేసిన ఓ కసాయి.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌ చందానగర్ పోలీస్​స్టేషన్‌ పరిధిలోని పాపిరెడ్డినగర్ రాజీవ్ గృహకల్పలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. భార్యపై అనుమానంతోనే భర్త ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

chandanagar murder case update
chandanagar murder case update
author img

By

Published : Oct 17, 2022, 10:47 PM IST

భార్యపై అనుమానం.. భార్యతోపాటు పిల్లల్ని హత్యచేసి తాను కూడా..

Chandanagar Murder Case Update: అనుమానం ఓ నిండు కుటుంబాన్ని బలితీసుకుంది. అన్యోన్యంగా సాగుతున్న వారి సంసార జీవితంలో అనుమానమే యమపాశంలా మారింది. హైదరాబాద్‌ చందానగర్ పోలీసుస్టేషన్‌ పరిధిలోని పాపిరెడ్డికాలనీ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న నాగరాజు ఈ దారుణానికి ఒడిగట్టాడు. అతని భార్య సూజాత, రెండో తరగతి చదువున్న ఏడేళ్ల కుమార్తె రమ్యశ్రీ, ఐదో తరగతి చదువున్న సిద్దప్పను హత్య చేశాడు. ముగ్గురిని హత్య చేసిన అనంతరం నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు.

పిల్లలపై కూడా కనికరం లేకుండా: పిల్లలు, భార్య నిద్రిస్తున్న సమయంలోనే భార్య టైలరింగ్ కోసం వాడే కత్తెరతో పొడిచి హత్య చేసినట్లు గుర్తించారు. కుమారుడిని పొత్తి కడుపులో, కుమార్తెను వీపు మీద, భార్యను మెడ, తలపై కత్తెరతో పొడిచి చంపినట్లు గుర్తించారు. మృతదేహాల స్థితిని బట్టి రెండు రోజుల క్రితం హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు రోజులుగా నాగరాజు వాళ్లింటి తలుపు తీయకపోవడం, దుర్వాసన వస్తుండటంతో స్థానికులు కిటికీ తలుపులు పగులగొట్టగా ఇద్దరు పిల్లలూ నిర్జీవంగా పడి ఉన్నారు.

కత్తెరతో అందరినీ పొడిచి తాను కూడా..: దీంతో చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు తలుపులు బద్దలుకొట్టి చూడగా.. నాగరాజు ఉరివేసుకుని ఇద్దరు పిల్లలు విగతజీవులుగా పడిఉన్నారు. మరో గదిలో భార్య సుజాత రక్తస్రావంతో మృతి చెంది ఉంది. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. హత్యకు ఉపయోగించిన కత్తెరను స్వాధీనం చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

స్వగ్రామంలో విషాదఛాయలు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కోహీర్ గ్రామానికి చెందిన నాగరాజు, సుజాత దంపతులు బతుకుదెరువు కోసం ఏడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. నాగరాజు స్థానికంగా ఓ డీలర్ వద్ద పప్పు దినుసులు, నిత్యావసర వస్తువులు దుకాణాలకు సరఫరా చేసే ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. భార్య సుజాత ఇంట్లోనే టైలర్ పని చేస్తుంది. దీంతో పాటు సుజాత ఫైనాన్స్ వ్యాపారం చేస్తోంది. కొన్ని నెలలుగా నాగరాజు సుజాతల మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయి.

ఎప్పటి నుంచో భార్యను వేధించేవాడు: ఫైనాన్స్ వ్యాపారం కోసం ఓ వ్యక్తి వద్ద సుజాత నగదు తీసుకుంటుంది. అయితే అతనితో భార్యకు సంబంధం ఉందని నాగరాజు భార్యను అనుమానిస్తున్నాడు. ఇదే విషయంలో ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్న సమయంలో వారికి నచ్చజెప్పేవాళ్లమని.. ఆమెను తరచూ నాగరాజు కొట్టేవాడని చెబుతున్నారు. నెలలుగా నాగరాజుకు పనికి కూడా వెళ్లడం లేదని స్థానికులు తెలిపారు.

విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు: కత్తెరతో దాడి చేసి హత్య చేసినప్పుడు తమకు ఎలాంటి శబ్దాలు వినిపించలేదని.. మత్తు మందు ఇచ్చి వారు నిద్ర మత్తులో ఉండగా హత్య చేసి ఉంటాడని చెబుతున్నారు. స్థానికులు చెప్పిన ఆధారంగా నలుగురి మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ కేసులో అనుమానితులను ప్రశ్నించి పూర్తి వివరాలు తెలుసుకోనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.