ETV Bharat / crime

LIVE VIDEO: ఒంటరి మహిళలలే టార్గెట్​.. గొలుసు ఎత్తుకెళ్లిన చైన్​ స్నాచర్స్​ - చైన్​ స్నాచింగ్​

Chain snatchers in Hyderabad: దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర అన్నట్లు ఉంది నగరంలోని చైన్​ స్నాచర్స్​ వ్యవహారం. పోలీసులు ఎంత నిఘా పెట్టినాసరే.. దుండగులు వారి చేతులకు పని చెబుతున్నారు. తాజాగా మియాపూర్​లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.

chain snatching
చైన్​ స్నాచింగ్​
author img

By

Published : Feb 8, 2023, 8:06 PM IST

Chain Snatching In Miyapur: హైదరాబాద్ నగరంలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ మాట ఇప్పుడు కాదు ఎన్నో రోజుల నుంచి భాగ్యనగరంలో వినిపిస్తూనే ఉంది. జల్సాలకు అలవాటు పడిన కొందరు యువత.. ఈజీ మనీ కోసం ఇటువంటి దారులను ఎంచుకుంటున్నారు. దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర అన్నట్లు సాగుతుంది వీరి వ్యవహారం. ఆ క్షణానికి చేతిలో డబ్బులు లేకపోతే.. ఇటువంటి మార్గాలను ఎంచుకుని ఎదుటివారి ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే కాకుండా నగరంలో నివాసం ఉండే కొంత మంది యువత సైతం ఇటువంటి గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఒంటరి మహిళలు, వృద్ధులే లక్ష్యంగా చేసుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా వీరి ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉంటున్నాయి అన్న భయంలేకుండా వారు.. ఎంతో చాకచక్యంగా ఇటువంటి పనులు కానిస్తున్నారు.

తాజాగా హైదరాబాద్​ నగరంలోని మియాపూర్‌లో ఓ మహిళ మెడల్లోంచి బంగారు గొలుసును దుండగులు బైక్​పై నుంచి వచ్చి తెంచుకుని పారిపోయారు. ఈ దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మియాపూర్​ ప్రశాంత్​ నగర్​లోని కృషినగర్​లో ఓ ప్రైవేటు స్కూల్లో రెండవ తరగతి చదువుతున్న తన కుమారుడిని ఇంటికి తీసుకొని వెళ్లడానికి ఓ మహిళ వచ్చింది. తన పిల్లాడిని ఇంటికి తీసుకొని వెళుతుండగా.. ఆ ప్రాంతం నిర్మానుశ్యంగా ఉండడంతో ఆమె ఎదురుగా బైక్​పై ముందుగా కాపుకాచుకొని దుండగులు ఎదురు చూశారు.

మియాపూర్​లో మహిళ ఎత్తుకెళ్లిన చైన్​ స్నాచర్స్​

మహిళ అటుగా రావడంతోనే వేగంగా బైక్​పై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని వెళ్లిపోయారు. బాధితురాలు కేకలు వేసినా సరే.. ఎవరు అటువైపు రాకపోవడంతో ఫలితం లేకుండాపోయింది. బంగారు గొలుసు రెండు తులాలు ఉంటుందని ఆమె వాపోయింది. ఈ విషయంపై మియాపూర్​ పోలీస్​ స్టేషన్​లో ఆమె ఫిర్యాదు చేశారు.

గత కొంత కాలంగా నగరంలోనూ.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దుండగులు గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి శివారు ప్రాంతాల్లో మహిళలకు అసలు భద్రత లేకుండా పోయిందని.. మహిళలకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ప్రతిరోజు నగరంలోని ఎక్కడో దగ్గర చైన్​ స్నాచింగ్​ అనే వార్త వస్తూనే ఉందని స్థానికులు భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఎవరు ఎటునుంచి వస్తారా అనే భయంతో ఉంటున్నామని వాపోతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.